- Advertisement -

హైడ్రాకు హైకోర్టు అక్షింతలు

- Advertisement -

సున్నం చెరువు కూల్చివేతలు మరియు ఫెన్సింగ్ వివాదంపై తెలంగాణ హైకోర్టు మరోసారి HYDRA (హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ అథారిటీ) పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడంతో పాటు, రాజ్యాంగ హక్కులను కాలరాసిందంటూ హైకోర్టు తీవ్ర స్థాయిలో మండిపడింది.

కోర్టు ప్రశ్నలు’సున్నం చెరువు’ కూల్చివేతల విషయంలో గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘిస్తూ ఫెన్సింగ్ ఎందుకు వేశారు అని హైకోర్టు ..HYDRA ను ప్రశ్నించింది. అంతేకాకుండా, గ్రీన్ ట్రిబ్యునల్ నివేదికను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ఘాటుగా విమర్శించింది. FTL నిర్ధారించకుండా కూల్చివేతలు ఎలా చేస్తారని, FTL నిర్ధారణ జరగనప్పుడు హద్దులు ఎలా నిర్ణయిస్తారని హైకోర్టు ప్రశ్నించింది.

హద్దుల విషయంలో సర్వే చేసే దిశగా ఎందుకు ప్రయత్నించలేదని నిలదీసింది. సున్నం చెరువు సమీపంలోని సియేట్ కాలనీలో ఉన్న వారిపై HYDRA తీసుకున్న చర్యలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 300-A (ఆస్తి హక్కు) ప్రకారం హక్కుల ఉల్లంఘనకు దారి తీస్తాయని హైకోర్టు స్పష్టం చేసింది. సియేట్ కాలనీ వాసుల స్థలాలలో ఫెన్సింగ్ వేయడం, కూల్చివేయడం లాంటి చర్యలు చేపట్టవద్దని ను హైకోర్టు హెచ్చరించింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -