- Advertisement -

ఎంపీ ఆర్ కృష్ణయ్యపై సీపీఐ నారాయణ ఫైర్

- Advertisement -

బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంలో ఎంపీ ఆర్ కృష్ణయ్య వైఖరిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపితే, కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని విమర్శించారు. తాను బీసీ అని చెప్పుకునే ప్రధాని నరేంద్ర మోదీ ఈ బిల్లును ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

బీజేపీ తరపున ఎంపీగా ఉన్న ఆర్ కృష్ణయ్య ఈ అంశంలో నాటకాలు ఆడుతున్నారని నారాయణ ఆరోపించారు. బీజేపీ సంకలో కూర్చుని బీసీ ఉద్యమానికి కృష్ణయ్య న్యాయం చేయడం లేదని అన్నారు. నిజంగా బీసీల పక్షాన నిలబడాలనే చిత్తశుద్ధి ఉంటే, పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్లకు మద్దతు తెలిపే పార్టీలను, నాయకులను కలిపి ఏకతాటిపైకి తీసుకురావాలని సూచించారు.

పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్లపై గట్టి పోరాటం చేయాల్సిన బాధ్యత ఎంపీలపై ఉందని నారాయణ అన్నారు. ఎంపీలు కలిసి ధర్నా చేస్తే సీపీఐ కూడా సంపూర్ణ మద్దతు ఇస్తుందని స్పష్టం చేశారు. బీసీల హక్కుల కోసం మాటలకే పరిమితం కాకుండా కార్యాచరణ అవసరమని, లేకపోతే బీసీ సమాజం ఈ నాటకాలను గుర్తుంచుకుంటుందని నారాయణ హెచ్చరించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -