స్కిల్ డెవలప్మెంట్ కేసులో మరో కీలక మలుపు. చంద్రబాబుతో సహా 37 మంది నిందితులపై కేసు ముగించటంపై ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రైల్వే మాజీ ఉద్యోగి వేము కొండలరావు.
సీఐడీ పోలీసులు ఫైల్ చేసిన ఫైనల్ రిపోర్ట్, కోర్టు ఉత్తర్వులు ఇప్పించవలసిందిగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో వందల కోట్ల రూపాయలు దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై 54 రోజులు రిమాండ్‌లో ఉన్నారు చంద్రబాబు.
ఫిర్యాదుదారుడు 164 స్టేట్‌మెంట్ ఇచ్చినప్పటికీ కేసు ఏ విధంగా ముగించారన్న కోర్టు ఉత్తర్వులు ఇప్పించాలని పిటిషనర్ పేర్కొన్నారు. పిటిషనర్ తరపున మాజీ జడ్జి జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించగా ఈ పిటిషన్‌పై జనవరి 19న విచారిస్తామని ఏసీబీ న్యాయస్థానం తెలిపింది.ఏసీబీ న్యాయస్థానం ఉత్తర్వులు ఇవ్వకపోతే హైకోర్టును ఆశ్రయిస్తామని పిటిషనర్ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ తెలిపారు.
