- Advertisement -

టీ20ల్లో టీమిండియా ప్రదర్శన ఇదే!

- Advertisement -

మరో రెండు రోజుల్లో ఫిబ్రవరి 7 నుండి టీ20 వరల్డ్ కప్ ప్రారంభంకానుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ ప్రతిష్టాత్మక టోర్నీ ఇది 10వ ఎడిషన్. 20 జట్లు పాల్గొంటున్న ఈ మెగా ఈవెంట్‌పై క్రికెట్ అభిమానుల చూపంతా ఉంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న టీమిండియా మరోసారి చరిత్ర సృష్టించాలనే లక్ష్యంతో ఉంది. ఈసారి గెలిస్తే వరుసగా టైటిల్ నిలుపుకున్న తొలి జట్టుగా, అత్యధిక టీ20 వరల్డ్‌కప్‌లను గెలిచిన జట్టుగా భారత్ నిలవనుంది.

ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్‌కప్‌ల్లో భారత్ ప్రదర్శన ఎలా ఉందో చూద్దాం. 2007లో తొలి టీ20 వరల్డ్‌కప్ జరిగింది. ఎంఎస్ ధోనీ నాయకత్వంలో యువ జట్టుతో బరిలోకి దిగిన భారత్, ఫైనల్లో పాకిస్థాన్‌ను ఓడించి తొలి టైటిల్ సాధించింది. ఆ తర్వాత 2009లో డిఫెండింగ్ చాంపియన్‌గా వెళ్లిన భారత్ సూపర్-8 దశలోనే నిష్క్రమించింది.

2010, 2012 ఎడిషన్లలో కూడా భారత్ సూపర్-8 దశకే పరిమితమైంది.2014లో ఫైనల్‌కు చేరినా శ్రీలంక చేతిలో ఓడిపోయింది.2016లో సెమీఫైనల్‌లో వెస్టిండీస్ చేతిలో పరాజయం పాలైంది.2021లో గ్రూప్ దశలోనే నిష్క్రమించింది.2022లో సెమీఫైనల్‌లో ఇంగ్లండ్ చేతిలో ఓడింది.2024లో దక్షిణాఫ్రికాపై గెలిచి రెండోసారి టైటిల్ సాధించింది. ఈసారి డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతోంది టీమిండియా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -