- Advertisement -

పెళ్లి బరత్‌లో ఘర్షణ..యువకుడిపై దాడి!

- Advertisement -

ఉత్తరప్రదేశ్‌లో పెళ్లి ఊరేగింపులో జరిగిన ఘర్షణ హింసాత్మకంగా మారి ఒక యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన కలకలం రేపింది. ఫిబ్రవరి 10న నోయిడా సమీపంలోని ఓ గ్రామంలో పెళ్లి బారాత్ ఊరేగింపు సందడి మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. సంగీతం, నృత్యాలతో ఉత్సాహంగా సాగుతున్న వేడుకలో చిన్నపాటి వాగ్వాదం చెలరేగి, క్షణాల్లో ఉద్రిక్తతకు దారితీసింది.

గ్రామానికి చెందిన హిమాంశు అనే యువకుడు అక్కడున్న కొందరితో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. మాటల తూటాలు కాస్తా ఘర్షణగా మారి, కొంతమంది యువకులు, టీనేజర్లు కలిసి అతన్ని చుట్టుముట్టారు. పరిస్థితి అదుపు తప్పడంతో హిమాంశును సమీపంలోని ఇరుకైన గల్లీలోకి ఈడ్చుకెళ్లారు.

తరువాత సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో హిమాంశుపై దాడి దృశ్యాలు కనిపించాయి. అతన్ని చెంపదెబ్బలు కొడుతూ, కాళ్లతో తన్నుతూ, కర్రతో కొడుతూ దాడి చేసినట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. దాడి చేసేవారు దూషణలు చేస్తుండగా, హిమాంశు తనను తాను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.

దాడి తర్వాత నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలతో ఉన్న హిమాంశు ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. మొదట ఈ ఘటన పోలీసులకు తెలియజేయలేదు. వీడియో వైరల్ కావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. త్వరలోనే నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తామని అధికారులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -