- Advertisement -

మంత్రి నియోజకవర్గంలో జోరుగా కోడి పందాలు!

- Advertisement -

తెలంగాణ మంత్రి సీతక్క(Seethakka) ప్రాతినిధ్యం వహిస్తున్న ములుగు( Mulugu) నియోజకవర్గంలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. రోజుకు రూ.50 లక్షల వరకు బెట్టింగ్ జరుగుతోందన్న ప్రచారం స్థానికంగా చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో కోడి పందాలు, బెట్టింగ్‌పై నిషేధం ఉండటంతో నిర్వాహకులు కొత్త మార్గాలు అనుసరిస్తున్నట్లు సమాచారం.

వెయ్యి మందికి పైగా సభ్యులతో ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి వారంలో మూడు రోజులు ఆటలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. జూదగాళ్లను ప్రత్యేక వాహనాల్లో తరలించి, సరిహద్దు ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్ శివారులో పోటీలు నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ చర్యల వెనుక ఓ ముఠా పనిచేస్తోందని, కొందరు స్థానిక రాజకీయ నాయకుల అండతో బెట్టింగ్ రాయుళ్లను ఆకర్షిస్తున్నారన్న ప్రచారం ఉంది.

భద్రాచలం, ఇల్లందు,సత్తుపల్లి,వరంగల్ ప్రాంతాలతో పాటు ఆంధ్రాకు చెందిన జూదగాళ్లను కూడా సమీకరించి పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అధికారులు ఈ వ్యవహారంపై నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి నిజానిజాలు వెలికితీయాలని స్థానికులు కోరుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -