- Advertisement -

మదనపల్లి బాలిక హత్యకేసుపై జిల్లా ఎస్పీ

- Advertisement -

మదనపల్లి బాలిక హత్యకేసుపై జిల్లా ఎస్పీ ధీరజ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ కేసులో నిందితుడైన కులవర్ధన్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన వెల్లడించారు. కనసానిపల్లి చెరువులో దూకి ప్రాణాలు తీసుకున్నట్లు తెలిపారు. బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసులో కులవర్ధన్ ప్రధాన నిందితుడని ఎస్పీ పేర్కొన్నారు.

నిందితుడిని నిన్న అదుపులోకి తీసుకున్నామని, అయితే పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకుని పరారయ్యాడని తెలిపారు. వెంటనే ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ క్రమంలో చెరువులో మృతదేహం కనిపించడంతో గుర్తింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు.

ప్రస్తుతం కులవర్ధన్ మృతదేహం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉందని, పోస్టుమార్టం అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ ధీరజ్ తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, సంబంధిత అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -