- Advertisement -

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం

- Advertisement -

విజయవాడ కొత్త ప్రభుత్వ సర్వజనాసుపత్రి (GGH)లో ఒక కరోనా కేసు నమోదు కావడం స్థానికంగా కలకలం రేపింది. ఎన్టీఆర్ జిల్లా తిరువూరుకు చెందిన 13 ఏళ్ల బాలికకు కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.

గత కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న సదరు బాలికను మెరుగైన చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చారు. బాలికకు ఉన్న లక్షణాల ఆధారంగా అనుమానం వచ్చిన వైద్యులు ముందు జాగ్రత్తగా కరోనా పరీక్షలు నిర్వహించారు.

వైద్యులు నిర్వహించిన ఆర్టీపీసీఆర్ ల్యాబ్ పరీక్షల్లో ఆ బాలికకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు అధికారికంగా నిర్ధారణ అయింది. దీంతో ఆసుపత్రి వర్గాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. బాలికను సాధారణ వార్డు నుండి వైరస్ మరింత మందికి వ్యాపించకుండా ఉండేందుకు జీజీహెచ్‌లోని ప్రత్యేక కోవిడ్ వార్డుకు తరలించారు.

ప్రస్తుతం ప్రత్యేక వైద్య బృందం నిరంతరం బాలిక ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ చికిత్స అందిస్తోంది. ప్రస్తుతం బాలిక పరిస్థితి స్థిరంగానే ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు, ఈ కేసు నమోదు కావడంతో బాలిక కుటుంబ సభ్యులకు, ఆమెతో ప్రాథమికంగా కాంటాక్ట్ అయిన వారికి కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించేందుకు వైద్యాధికారులు చర్యలు చేపట్టారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే జ్వరం, దగ్గు వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -