- Advertisement -

ధురంధర్‌ 2లో ఇమ్రాన్ హష్మీ!

- Advertisement -

బ్లాక్‌బస్టర్ చిత్రం ధురంధర్‌కి సీక్వెల్‌గా ధురంధర్: ది రివెంజ్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందురానుంది.

ఇక ఈ సినిమా గురించిన ఆసక్తికర వార్త ఇప్పుడు బీ టౌన్‌లో వైరల్‌గా మారింది. ఈప్రాజెక్టులో బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ భాగస్వామ్యం కానున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన లేఖ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా ఈ చిత్రంలో ‘బడే సాహెబ్’ పాత్రలో కనిపించవచ్చని ఊహాగానాలు మరింత బలపడ్డాయి.

అయితే దర్శకుడు ఆదిత్య ధర్ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. ఈసారి చిత్రాన్ని తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్ మరియు B62 స్టూడియోస్ నిర్మిస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -