‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధిస్తూ ప్రపంచవ్యాప్తంగా రూ.1,600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే తాజాగా ఈ సినిమాకు లీగల్ సమస్య వచ్చిపడింది.
త్రిమూర్తి ఫిల్మ్స్ సంస్థ…. దర్శకుడు ఆదిత్య దర్ కు చెందిన B62 స్టూడియోస్‌పై బాంబే హైకోర్టులో కేసు వేసింది.సినిమాలోని “రంగ్ దే లాల్” అనే పాట, 1989లో వచ్చిన త్రిదేవ్ సినిమాలోని ప్రసిద్ధ “తిర్చీ టోపీవాలే” పాటకు చాలా దగ్గరగా ఉందని ట్రిమూర్తి ఫిల్మ్స్ ఆరోపిస్తోంది. తమ అసలు పాటను సరైన అనుమతి లేకుండా ఉపయోగించారని వారు పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో, ఆ పాటను థియేటర్లలో, ప్రమోషన్లలో, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో వినియోగించకుండా నిలిపివేయాలని కోర్టును ట్రిమూర్తి ఫిల్మ్స్ కోరింది. అలాగే, సినిమా ఆదాయంలో వాటా కూడా ఇవ్వాలని డిమాండ్ చేసింది.
కోర్టు ట్రిమూర్తి ఫిల్మ్స్‌కు అనుకూలంగా తీర్పు ఇస్తే, “రంగ్ దే లాల్” పాటను సినిమాలో నుంచి పూర్తిగా తొలగించే పరిస్థితి రావచ్చు. ఇది థియేటర్లలోనే కాకుండా OTT ప్లాట్‌ఫార్మ్‌లలో కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ వివాదం ఎలా ముగుస్తుందో, కోర్టు ఏ విధంగా తీర్పు ఇస్తుందో చూడాల్సి ఉంది.
