- Advertisement -

అప్పుల్లో చంద్ర‌బాబు రికార్డ్ బ్రేక్!

- Advertisement -

ఏపీ సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో అప్పులు బాగా పెరిగిపోయాయని తెలిపారు వైఎస్ జగన్. మీడియాతో మాట్లాడిన ఆయన .. చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్లు కూడా పూర్తికాకముందే రాష్ట్రం చేసిన అప్పులు రూ.3,20,454 కోట్లకు చేరాయని జగన్ తెలిపారు. తమ ఐదేళ్ల పాలనలో మొత్తం రూ.3 లక్షల 31 వేల కోట్ల అప్పు మాత్రమే చేశామని, అయితే ప్రస్తుతం చాలా తక్కువ కాలంలోనే దాదాపు అదే స్థాయిలో అప్పులు పెరిగాయని అన్నారు. ఇది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధానానికి నిదర్శనమని విమర్శించారు.

2024–25 ఆర్థిక సంవత్సరంలో ట్రెజరీలో కనీస నగదు నిల్వలు ఉన్న రోజులు కేవలం 8 రోజులు మాత్రమేనని జగన్ పేర్కొన్నారు. మొత్తం 365 రోజులలో 357 రోజులు ట్రెజరీలో కనీస బ్యాలెన్స్ కూడా ఉంచలేదని ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రచారం మరియు వాస్తవ పరిస్థితుల మధ్య ఉన్న తేడాను ఈ లెక్కలు స్పష్టంగా చూపిస్తున్నాయని అన్నారు.

ఇంకా, 2024–25లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు రూ.81,082 కోట్లుగా కాగ్ నివేదికలో ఉన్నప్పటికీ, అసెంబ్లీలో మాత్రం రూ.60,485 కోట్లుగా తప్పుడు లెక్కలు చూపించారని జగన్ ఆరోపించారు. దీనిపై క్యాబినెట్ సెక్రటరీకి లేఖ రాయనున్నట్లు తెలిపారు. చంద్రబాబు కోసం పని చేస్తున్న అధికారుల ఉద్యోగాలే ప్రశ్నార్థకంగా మారుతాయని హెచ్చరించారు.

అలాగే 16 రోజుల అసెంబ్లీ సమావేశాలపై కూడా జగన్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు తన కుమారుడిని ఎత్తుతాడని, ఆయన కుమారుడు తిరిగి చంద్రబాబును ఎత్తుతాడని, ఈ ఇద్దరినీ పవన్ కళ్యాణ్ ఎత్తుతాడని విమర్శించారు. కానీ ఈ రాజకీయ ప్రచారాల వల్ల ప్రజలకు మాత్రం ఎలాంటి ప్రయోజనం కలగలేదని జగన్ అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -