తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ మరియు నటుడు విజయ్‌కి చెందిన టీవీకే మధ్య పొత్తు అవకాశాలపై జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. టీవీకే అధినేత విజయ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం తో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 80 స్థానాలు కేటాయించేలా బీజేపీ ప్రతిపాదన ఇచ్చిందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఇందుకోసం పవన్ మధ్యవర్తిత్వం వహించారని కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ వార్తలపై తాజాగా స్పందించిన పవన్ కళ్యాణ్ స్పష్టత ఇచ్చారు. ఓ తమిళ టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ప్రచారాన్ని పూర్తిగా ఖండించారు. టీవీకే పార్టీని ఎన్డీయేలో చేర్చేందుకు తాను ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని ఆయన స్పష్టం చేశారు.
విజయ్ ఎన్డీయే కూటమిలో చేరాలని నేను ఎలాంటి ప్రతిపాదన చేయలేదు. అసలు విజయ్‌ను నేను చివరిసారిగా కలిసింది దాదాపు 20 నుంచి 25 సంవత్సరాల క్రితమే. ఈ వార్తలు ఎలా వచ్చాయో నాకు తెలియదు అని పవన్ పేర్కొన్నారు. విజయ్ రాజకీయ నిర్ణయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమైనవని కూడా ఆయన తెలిపారు.
తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే విడతలో పోలింగ్ జరగనుండగా, మే 4న ఫలితాలు వెల్లడించనున్నారు.
