- Advertisement -
మనశంకర వరప్రసాద్ గారు చిత్రంతో సూపర్ హిట్ కొట్టారు అనిల్ రావిపూడి. ఈ సినిమా తన తదుపరి చిత్రానికి ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఇటీవల వెంకటేష్, కళ్యాణ్ రామ్‌తో మల్టీస్టారర్‌ను ప్రకటించారు.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో హీరోయిన్గా కృతిశెట్టిని హీరోయిన్గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కృతి శెట్టి ఈ చిత్రంలో కల్యాణ్ రామ్ సరసన నటించే అవకాశముందని ప్రచారం జరుగుతోంది.
ఇక వెంకటేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్గా నటించనుందని తెలుస్తోండగా అయితే ఈ సినిమా నిర్మాణ సంస్థకు సంబంధించిన వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. ఈ చిత్రాన్ని సంక్రాంతి 2027 సందర్భంగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
