కర్ణాటకలో ఓ విద్యార్థిని ఆత్మహత్య ఘటన కలకలం రేపింది. సహ విద్యార్థులు వ్యాపింపజేసిన పుకార్ల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఈ తీవ్ర నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. చిత్రదుర్గ జిల్లా హోలల్కెరే పట్టణానికి చెందిన 22 ఏళ్ల లిఖిత అనే యువతి ఈ దారుణ ఘటనకు పాల్పడింది. ఆమె మల్లడిహళ్లిలోని కళాశాలలో ఆయుర్వేద సైన్సెస్ చివరి సంవత్సరం చదువుతోంది.
లిఖిత తన సూసైడ్ నోట్‌లో కీలక విషయాలను వెల్లడించింది. కాలేజీలో కొంతమంది సహ విద్యార్థులు ఒక ప్రొఫెసర్‌తో తనకు సంబంధం ఉందని పుకార్లు వ్యాపింపజేశారు.ఈ కారణంగా తనను ఎగతాళి చేయడం, అవమానించడం జరిగింది
ఈ వేధింపులు తట్టుకోలేక తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యానని పేర్కొంది. పోలీసులు స్వాధీనం చేసుకున్న సూసైడ్ నోట్‌లో…పుకార్లు వ్యాప్తి చేసిన విద్యార్థుల పేర్లు,
వారి వ్యాఖ్యలు, ప్రవర్తన తనను ఎంతగా బాధించాయో వివరంగా పేర్కొన్నట్లు సమాచారం.
లిఖిత తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులే. పరిస్థితి గురించి తెలిసిన తర్వాత ఆమెను ఓదార్చే ప్రయత్నం చేశారు.చదువుపై దృష్టి పెట్టమని సూచించారు..
అయితే, ఆమె ఎదుర్కొన్న మానసిక ఒత్తిడి తీవ్రంగా మారిందని కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పుకార్లు వ్యాప్తి చేసిన వారిపై చర్యలు తీసుకునే అవకాశముంది.
