- Advertisement -

ప్రేమ పెళ్లి.. నెల రోజులకే ఆత్మహత్య

- Advertisement -

సిద్దిపేట జిల్లాలో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఎన్నో కలలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆ జంట, నెల తిరగకముందే నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంది. అనుమానం అనే పెనుభూతం ఒక పచ్చని సంసారంలో చిచ్చుపెట్టి, ఇద్దరినీ బలితీసుకుంది. కొండపాక గ్రామంలో ఈ హృదయ విదారక ఘటన జరిగింది. ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్న అంజలి, వినయ్ అనే యువతీ యువకులు పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. కానీ, పెళ్లయిన నెల రోజులకే ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది.

అంజలి, వినయ్‌లు ఏడాది కాలంగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమను అంగీకరించిన పెద్దలు, గత నెల (ఏప్రిల్) 9వ తేదీన ఘనంగా పెళ్లి జరిపించారు. పెళ్లయిన కొద్దిరోజులకే వీరి సంసారంలో మనస్పర్ధలు మొదలయ్యాయి. అంజలి ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడుతోందని వినయ్ అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి.

గొడవ ముదరడంతో వినయ్ తీవ్ర కోపానికి గురై, అంజలిని ఆమె పుట్టింట్లో వదిలిపెట్టి వచ్చాడు. ఆ తర్వాత కూడా ఫోన్ ద్వారా ఆమెపై పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. భర్త తనను అనుమానించడం, అందరి ముందు అవమానపరచడంతో అంజలి తీవ్ర మనస్థాపానికి గురైంది. తన పుట్టింట్లోనే ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

అంజలి మరణవార్త తెలిసిన వెంటనే వినయ్ దిగ్భ్రాంతికి లోనయ్యాడు. తను చేసిన తప్పును తెలుసుకుని కుమిలిపోయిన అతను, భార్య లేని జీవితం తనకు వద్దనుకున్నాడో ఏమో గానీ.. ఊరి బయట ఒక చెట్టుకు ఉరివేసుకొని తను కూడా తనువు చాలించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -