కృష్ణా జిల్లాలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేయడం హాట్‌టాపిక్‌గా మారింది.చిలకలపూడి పోలీస్ స్టేషన్‌లో పేర్ని నానిపై కేసు నమోదు చేశారు.
మచిలీపట్నం కొబ్బరితోట ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను మున్సిపల్ అధికారులు కూల్చివేయడంతో ఈ ఘటన ప్రారంభమైంది. మచిలీపట్నంలోని ఆరో వార్డులో మున్సిపల్ అధికారులు పలు ఇళ్లను కూల్చివేశారు. ఈ చర్యపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా, మాజీ మంత్రి పేర్ని నాని అక్కడికి చేరుకుని వారిని పరామర్శించారు.
ఈ సందర్భంగా పేర్ని నాని అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.తన అనుచరులతో కలిసి అక్కడికి వెళ్లి, అధికారుల చర్యలను ప్రశ్నిస్తూ వాగ్వాదానికి దిగారు.ఈ ఘటనపై పోలీస్ అధికారుల సంఘం ఫిర్యాదు చేయడంతో, ఆయనపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.
