- Advertisement -

అధికారుల‌పై కారం చ‌ల్లిన వృద్ధురాలు!

- Advertisement -

ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నాడు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ‘ప్రజా పరిష్కార వేదిక’ (గ్రీవెన్స్ సెల్) సాక్షిగా ఒక వృద్ధురాలు అధికారులపై కారం చల్లి తన నిరసనను వ్యక్తం చేసింది. ఈ ఘటన కలెక్టరేట్ ప్రాంగణంలో ఒక్కసారిగా కలకలం రేపింది.

బాధిత వృద్ధురాలు తెలిపిన వివరాల ప్రకారం.. నేషనల్ హైవే (జాతీయ రహదారి) విస్తరణ కోసం ప్రభుత్వం ఆమెకు చెందిన భూమిని స్వాధీనం చేసుకుంది. ఈ భూమికి సంబంధించి తనకు సుమారు రూ.24 లక్షల నష్టపరిహారం రావాల్సి ఉందని ఆమె పేర్కొంది. అయితే, అధికారులు ఆ డబ్బును ఆమెకు ఇవ్వకుండా, వేరే వ్యక్తుల ఖాతాల్లో జమ చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది.విసుగు చెందే ఈ నిర్ణయం..తనకు రావాల్సిన న్యాయమైన నష్టపరిహారం కోసం ఆమె గత కొంతకాలంగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతోంది. అప్పటికే అనేకసార్లు వినతిపత్రాలు ఇచ్చినా, అధికారులు కేవలం హామీలకే పరిమితమయ్యారని, క్షేత్రస్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆరోపించింది.

కార్యాలయాల చుట్టూ తిరిగి విసుగు చెందానని ఆమె వాపోయింది. అధికారుల ఉదాసీన వైఖరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఆమె, ఈరోజు నేరుగా ప్రజా పరిష్కార వేదికకు వచ్చి తన వెంట తెచ్చుకున్న కారాన్ని అధికారులపై చల్లింది. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో అక్కడ ఉన్న అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సదరు వృద్ధురాలిని అదుపులోకి తీసుకున్నారు. భూమి కోల్పోయి, నష్టపరిహారం అందక ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందునే ఆమె ఈ స్థాయికి వెళ్లాల్సి వచ్చిందని అక్కడున్న వారు చర్చించుకుంటున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఆమె భూమికి సంబంధించిన రికార్డులను పరిశీలించి, నష్టపరిహారం చెల్లింపులో జరిగిన పొరపాట్లపై నివేదిక కోరారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -