- Advertisement -

ఏపీ రేషన్ కార్డుదారులకు భారీ కానుక

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లోని రేషన్ కార్డు లబ్దిదారులకు గుడ్‌న్యూస్. ప్రజలకు నాణ్యమైన సేవలను అందించేందుకు కూటమి ప్రభుత్వం సరికొత్త కానుకను ప్రకటించింది. రేషన్ వ్యవస్థను కార్పొరేట్ స్థాయికి మారుస్తూ రాష్ట్రవ్యాప్తంగా మినీ మార్టుల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బహిరంగ మార్కెట్‌లో నిత్యావసర ధరల భారం నుండి సామాన్యులను రక్షించేందుకు ఈ వినూత్న నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.

తొలి విడతగా జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య భాగస్వామ్యంతో రాష్ట్రంలోని ప్రధాన పట్టణాలు, నగరాలలో 1,000 మినీ మార్టులను నెలకొల్పనున్నారు. ఈ మార్టులు చూడటానికి సూపర్ మార్కెట్ల తరహాలోనే ఆధునికంగా ఉంటాయి. వీటి ద్వారా రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం అందించే సరుకులతో పాటు పంచదార, గోధుమ పిండి, పామాయిల్, మిల్లెట్స్ వంటి పౌష్టికాహారాలు అత్యంత తక్కువ ధరకే లభించనున్నాయి.

అలాగే ఇకపై లబ్ధిదారులకు నాణ్యమైన స్టీమ్ రైస్ పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నుండి కూడా తగిన అనుమతులు లభించాయి. గతంలో ఇచ్చిన బియ్యం నాణ్యత లేకపోవడం వల్ల చాలామంది వాటిని అమ్ముకునేవారు . ఇప్పుడు నాణ్యమైన బియ్యాన్ని ఇవ్వడం ద్వారా లబ్ధిదారులు వాటిని పూర్తిస్థాయిలో ఇళ్లల్లోనే వినియోగించుకునేలా ప్రభుత్వం ఈ అడుగు వేసింది.

సరుకుల కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం మరియు పారదర్శకంగా మార్చేందుకు డిజిటల్ రూపాయి వాలెట్ పేమెంట్స్ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. వినియోగదారులు తమకు నచ్చిన నిత్యావసరాలను కొనుగోలు చేసి ఈ వాలెట్ ద్వారా డిజిటల్ పద్ధతిలో సులభంగా చెల్లింపులు జరపవచ్చు. ఈ నూతన సంస్కరణలను నేరుగా అమలు చేయకుండా తొలుత పైలట్ ప్రాజెక్ట్‌లుగా ప్రారంభించనున్నారు. స్టీమ్ రైస్ పంపిణీని మొదటగా పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన పథకంలో ప్రవేశపెడతారు. అలాగే డిజిటల్ వాలెట్ చెల్లింపుల విధానాన్ని విశాఖపట్నం నగరంలో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -