- Advertisement -

ఘోరం.. మాట్లాడుకుందాం రమ్మని పిలిచి.. భార్యను..

- Advertisement -

మల్కాజిగిరి పరిధిలో భయంకరమైన దారుణం వెలుగుచూసింది. కొంతకాలంగా సాగుతున్న కుటుంబ కలహాలు.. చివరకు ఒక మహిళ దారుణ హత్యకు దారితీశాయి. భార్యను పక్కా ప్లాన్ ప్రకారం తుపాకీతో కాల్చి చంపిన భర్త ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దారుణ ఘటనకు పాల్పడిన భర్త అరుణ్, అతనికి సహకరించిన మరో వ్యక్తి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాజిగిరి పరిధిలో నివసిస్తున్న నిషారాణికి, అరుణ్‌కు కొంతకాలం క్రితం వివాహం జరిగింది. అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తీవ్రమైన మనస్పర్థలు, గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఈరోజు తెల్లవారుజామున “మనమిద్దరం మాట్లాడుకుందాం.. రా” అంటూ భర్త అరుణ్ తన భార్య నిషారాణిని పిలిచాడు. ఇద్దరి మధ్య మాట మాట పెరగడంతో.. అరుణ్ తన వద్ద ముందే సిద్ధంగా ఉంచుకున్న గన్‌తో నిషారాణిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. బుల్లెట్లు శరీరంలోకి దూసుకెళ్లడంతో ఆమె రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

ఈ ఘోర హత్యకు భర్త అరుణ్‌కు మరో వ్యక్తి పూర్తిగా సహకరించినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కాగా.. నిందితుడు అరుణ్‌కు నేర చరిత్ర ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో అంబర్‌పేట్ పరిధిలో సైతం ఇతడు తుపాకీతో బహిరంగంగా హల్‌చల్ చేసి.. పోలీసు రికార్డుల్లోకి ఎక్కినట్లు సమాచారం. పాత గొడవల నేపథ్యంలోనే ఈరోజు తెల్లవారుజామున భార్యను అంతమొందించడానికి తుపాకీతో స్కెచ్ వేసి విజయవంతంగా అమలు చేశాడు.

సమాచారం అందుకున్న మల్కాజిగిరి పోలీసులు తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని.. క్లూస్ టీమ్ ఆధారంగా సాక్ష్యాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. భార్యను కిరాతకంగా కాల్చి చంపి పరారైన హంతకుడు అరుణ్, అతని స్నేహితుడి కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -