- Advertisement -

అది నాకు అతిపెద్ద బహుమతి: రకుల్

- Advertisement -

సినిమా రంగంలో స్టార్‌డమ్ అనేది అందమైనదే అయినా, తాను మాత్రం నటనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని అందాల తార రకుల్ ప్రీత్ సింగ్ స్పష్టం చేశారు. ఇటీవల ‘పతి పత్నీ ఔర్ వో దో’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె, తన కెరీర్ పట్ల తనకున్న స్పష్టమైన అభిప్రాయాలను వెల్లడించారు.

తాజా ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడుతూ, నటిగా తనను తాను నిరూపించుకోవడానికి అవకాశం ఉన్న కథలకే ఓకే చెబుతున్నానని తెలిపారు. “ప్రేక్షకులు నిజాయతీగా తీసిన చిత్రాలకు మాత్రమే కనెక్ట్ అవుతారు. అందుకే ఎంత ఆలస్యమైనా సరే, ప్రేక్షకులకు గుర్తుండిపోయే చిత్రాల్లోనే నటించాలని నిర్ణయించుకున్నాను. స్టార్‌డమ్ ముఖ్యం కాదు, నేను చేసే పనిని ప్రేక్షకులు ఇష్టపడి, నా నటనను మెచ్చుకుంటే అది నాకు లభించే అతిపెద్ద బహుమతి.” అని పేర్కొన్నారు. తనను తాను ఒకే మూస పద్ధతిలో బంధించుకోకుండా, ప్రతి సినిమా నుండి కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నానని ఆమె తెలిపారు.

సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్, విమర్శల పట్ల రకుల్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. “సోషల్ మీడియా విమర్శలకు దూరంగా ఉండటమే మంచిది. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా మనం చేసే పనిలో మనం నిమగ్నమై ఉండాలి. ఒకవేళ సామాజిక మాధ్యమాల్లో వచ్చే విమర్శలకు మీరు ప్రభావితం కావడం మొదలుపెడితే, అక్కడే మీ పతనం ప్రారంభమవుతుంది. అందుకే విమర్శలను పట్టించుకోకుండా, నా వృత్తిపై దృష్టి పెడుతున్నాను” అని రకుల్ తన మనసులోని మాటను బయటపెట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -