- Advertisement -

ఇంగ్లాండ్ టూర్..సూర్యవంశీ సపరేట్‌!

- Advertisement -

త్వరలో ఇంగ్లాండ్‌తో జరగబోయే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ సందర్భంగా భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన తోటి టీమిండియా ఆటగాళ్లతో కాకుండా ప్రత్యేక డ్రెస్సింగ్ రూమ్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. 16 ఏళ్లలోపు వయసున్న ఆటగాళ్ల రక్షణ కోసం ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) రూపొందించిన నిబంధనల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు.

15 ఏళ్ల సూర్యవంశీ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మరియు జట్టు సమావేశాల కోసం భారత డ్రెస్సింగ్ రూమ్‌లోకి రావడానికి అనుమతి ఉంటుంది. కానీ దుస్తులు మార్చుకునే సమయంలో మాత్రం అతను కేటాయించిన ప్రత్యేక గదిని ఉపయోగించాలి లేదా సీనియర్ ఆటగాళ్లు ఎవరూ లేని సమయంలో ప్రధాన డ్రెస్సింగ్ రూమ్‌లోనే ఒంటరిగా దుస్తులు మార్చుకుని సీనియర్లు వచ్చే సమయానికి అక్కడి నుండి వెళ్ళిపోవాల్సి ఉంటుంది.

ఈ వారంలో బెల్‌ఫాస్ట్‌లో ఐర్లాండ్‌తో జరగబోయే రెండు టీ20 మ్యాచ్‌లకు కూడా ఇటువంటి నిబంధనలే వర్తిస్తాయని సమాచారం. ఇందుకోసం స్టోర్‌మాంట్‌లోని సివిల్ సర్వీస్ క్రికెట్ గ్రౌండ్ పెవిలియన్‌లో భారత్‌కు మూడు ప్రత్యేక గదులను కేటాయించారు. ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ఫుట్‌బాల్‌లో కూడా ఆర్సెనల్ ఆటగాళ్లు ఏథన్ నవానేరి, మాక్స్ డౌమాన్ తమకు 16 ఏళ్లు నిండకముందు ఫస్ట్-టీమ్ మ్యాచ్‌లు ఆడినప్పుడు ఇదే విధమైన నిబంధనల ప్రకారం విడిగా చేంజింగ్ రూమ్‌లను ఉపయోగించారు.

ఈ పర్యటనలో ఈసీబీ ‘సేఫ్ హ్యాండ్స్’ పాలసీ ఎల్లప్పుడూ అమలులో ఉంటుంది. భారత జట్టు లైజన్ ఆఫీసర్ (TLO) తో క్రికెట్ రెగ్యులేటర్ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారు. సూర్యవంశీ వయసు రీత్యా అతని తల్లిదండ్రులు కూడా ఈ పర్యటనలో అతనితో ప్యాకేజీ ప్రోటోకాల్‌కు భిన్నంగా ఒకే హోటల్‌లో స్టే చేస్తున్నారు. ఇది ఆ కుర్రాడికి కుటుంబ పరంగా అదనపు మద్దతు, రక్షణను ఇస్తుంది అని ఈసీబీ ప్రతినిధి తెలిపారు.

మరోవైపు బీసీసీఐ (BCCI) సెక్రటరీ దేవజిత్ సైకియా అంతకుముందే మాట్లాడుతూ… సూర్యవంశీతో పాటు అతని తల్లిదండ్రులు కూడా ఈ పర్యటనకు వెళ్తారని, వారి ఖర్చులను బోర్డే భరిస్తుందని స్పష్టం చేశారు. సూర్యవంశీ తన చిన్న వయసులోనే ఇప్పటికే దేశీయ క్రికెట్ లో తన రాష్ట్ర జట్టుతో, ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో, అలాగే ఇటీవల శ్రీలంకలో జరిగిన ఇండియా ‘ఎ’ జట్టుతో కలిసి పురుషుల డ్రెస్సింగ్ రూమ్‌లను పంచుకున్నాడు. అయితే ఐర్లాండ్ లేదా ఇంగ్లాండ్‌పై అతను గనుక బరిలోకి దిగితే… భారతదేశం తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అత్యంత పిన్న వయస్కుడిగా సరికొత్త రికార్డు సృష్టిస్తాడు. తద్వారా 16 ఏళ్ల 205 రోజుల వయసులో అరంగేట్రం చేసిన సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును అతను బ్రేక్ చేస్తాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -