- Advertisement -

నేరుగా రంగంలోకి జగన్..

- Advertisement -

మాజీ సీఎం జగన్ గేరు మార్చారు. కొద్ది రోజులుగా వరుసగా ప్రజా అంశాల పైన ప్రభుత్వాన్ని లక్ష్యం గా చేసుకున్నారు. వారి సమస్యల పైన అల్టిమేటం జారీ చేస్తున్నారు. గోదావరి జిల్లాలో అక్వా రంగం సమస్యల పైన కొద్ది రోజుల క్రితం రైతులు జగన్ ను కలిసారు. తమ ఆవేదన వెలిబుచ్చారు. వారి సమస్యల పైన ప్రభుత్వం స్పందించాలని.. లేకుంటే, తానే వారికి మద్దతుగా నిరసనలు చేస్తానని హెచ్చరించారు. ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లేకపోవటంతో జగన్ ఇప్పుడు నేరుగా వారి కోసం రంగంలోకి దిగాలని నిర్ణయించారు.

మాజీ సీఎం జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కొద్ది రోజులుగా జగన్ రూటు మారింది. రెండేళ్ల పాలన పూర్తి కావటంతో ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. కీలక అంశాల పైన ప్రశ్నిస్తున్నారు. కాగా, ఇప్పుడు గోదావరి లో కీలకమైన ఆక్వా రంగం పైన ఫోకస్ చేసారు. ఇప్పటికే గోదావరి జిల్లాలకు చెందిన ఆక్వా రైతులు జగన్ ను కలిసారు. తమ సమస్యలను ప్రస్తావించారు. వారికి పరిష్కారం చూపే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే తానే గోదావరి జిల్లాల్లో ధర్నా కు వస్తానని అల్టిమేటం జారీ చేసారు. కాగా, సీఎం చంద్రబాబు స్వయంగా ఈ సమస్య పైన రివ్యూ చేసారు. డ్ ధర రూ 4 తగ్గించాలని నిర్దేశించారు. అయితే, రూ 2 మాత్రమే తగ్గించారనే వాదన వినిపిస్తోంది. ప్రతి ఎకరాకు వాగ్దానం చేసిన విద్యుత్ సబ్సిడీని ప్రభుత్వం అందించడంలో విఫలమైందని, ఒక్క కొత్త సబ్సిడీ విద్యుత్ కనెక్షన్ కూడా జారీ చేయలేదని, దీనివల్ల వేసవి కాలంలో మరింత కష్టాలు ఎదురయ్యాయని వివరిస్తున్నారు.

దీంతో, ఆక్వా రైతులకు మద్దతుగా జగన్ ఈ నెల 15న భీమవరం పర్యటనకు వెళ్లనున్నారు. రైతు సంఘాలతో చర్చలు జరిపి, పార్టీ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నారు. ఈ మేరకు పార్టీ నేత ప్రసాద రాజు కీలక అంశాలను ప్రస్తావించారు. రైతులకు అండగా నిలవకుండా, ప్రభుత్వం దాణా సిండికేట్లు, ఎగుమతిదారులు, మధ్యవర్తులను కాపాడుతోందని ఆరోపించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీడ్ ధరలను ప్రభుత్వం కిలోకు రూ.4 మేర ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చి, ఆ తర్వాత కేవలం రూ.2 మాత్రమే తగ్గించిందని చెప్పుకొచ్చారు. ప్రతి ఎకరాకు వాగ్దానం చేసిన విద్యుత్ సబ్సిడీని ప్రభుత్వం అందించడంలో విఫలమైందని, ఒక్క కొత్త సబ్సిడీ విద్యుత్ కనెక్షన్ కూడా జారీ చేయలేదని, దీనివల్ల వేసవి కాలంలో మరింత కష్టాలు ఎదురయ్యా యని ఆయన ఆరోపించారు. ఈ పర్యటనలో ఆక్వా రైతులకు మద్దతుగా జగన్ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -