- Advertisement -

హైకోర్టులో కవితకు బిగ్ షాక్

- Advertisement -

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తన కొత్త పార్టీకి ‘తెలంగాణ రక్షణ సమితి’ (TRS) అనే పేరును కేటాయించేలా భారత ఎన్నికల సంఘాన్ని (ECI) ఆదేశించాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించేందుకు ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాజకీయ పార్టీల పేర్ల కేటాయింపు, గుర్తింపు అనేది పూర్తిగా ఎన్నికల సంఘం పరిధిలోని అంశమని కోర్టు స్పష్టం చేసింది. ఈ దశలో కవిత దాఖలు చేసిన పిటిషన్‌ను తాము విచారణకు స్వీకరించడమంటే.. అది నేరుగా కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) విధుల్లో జోక్యం చేసుకోవడమే అవుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది.

కొత్త పార్టీ పేరు నమోదు ప్రక్రియలో భాగంగా ఇప్పటికే ఎన్నికల సంఘం కొన్ని అభ్యంతరాలను లేవనెత్తిందని కోర్టు గుర్తుచేసింది. ఈసీ లేవనెత్తిన ఆ అభ్యంతరాలకు కవిత సరైన రీతిలో, చట్టబద్ధంగా ముందే సమాధానం చెప్పుకోవాల్సి ఉందని ధర్మాసనం సూచించింది. ఆ ప్రక్రియను పూర్తి చేయకుండా, నేరుగా కోర్టును ఆశ్రయించడం సరికాదని పేర్కొంటూ.. ముందుగా ఈసీ అభ్యంతరాలకు సరైన సమాధానాలు ఇవ్వాలని, ఆ తర్వాతే అవసరమైతే కోర్టుకు రావాలని స్పష్టం చేస్తూ కవిత పిటిషన్‌ను కోర్టు పక్కనబెట్టింది.

గతంలో కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పేరును భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్)గా మార్చిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -