- Advertisement -

ముద్రగడ పాడె మోసిన జగన్.. కుటుంబ సభ్యులకు పరామర్శ

- Advertisement -

ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులను మాజీ సీఎం జగన్ పరామర్శించారు. కిర్లంపూడి చేరుకున్న జగన్ ముద్రగడ భౌతిక ఖాయానికి నివాళి అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అక్కడే ముద్రగడ అంతిమ కార్యాక్రమాలకు హాజరయ్యారు. పార్టీ నేతలతో కలిసి ముద్రగడ పాడె మోసిన జగన్.. కార్యక్రమం పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు. ముద్రగడ కుటుంబానికి పూర్తిగా మద్దతుగా నిలుస్తామని ప్రకటించారు.

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) అంత్యక్రియలకు మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన ముద్రగడ పద్మనాభం భౌతిక కాయం కిర్లంపూడికి తరలించారు. తొలుత ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులు తిరస్కరించారు. బతికున్న సమయంలో ముద్రగడను అనేక విధాలుగా అవమానించా రని.. ఇప్పడు అధికారిక గౌరవాలు, సానుభూతి అవసరం లేదని ఆయన కుటుంబసభ్యులు స్పష్టం చేశారు.వైసీపీ నేత జక్కంపూడి రాజా ఈ విషయాన్ని వెల్లడించారు.

ముద్రగడ అధికారం వెంట పరిగెత్తిన వ్యక్తి కాదని.. ప్రజా సమస్యలపై పోరాడిన నాయకుడు అని తెలిపారు. ఆయన బతికున్నప్పుడు ఇబ్బందులకు గురిచేసి.. ఇప్పుడు మరణించిన తర్వాత మొసలి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా, మాజీ సీఎం జగన్ భీమవరం పర్యటన తరువాత కిర్లింపూడి చేరుకున్నారు. ముద్రగడ కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. మాజీ సీఎం జగన్ కిర్లంపూడిలో ముద్రగడ భౌతిక ఖాయం సందర్శించి నివాళి అర్పించనున్నారు. ఈ సాయంత్రం ఆయన నివాస ప్రాంగణంలోనే ముద్రగడ అంత్య క్రియలు జరగనున్నాయి. ముద్రగడ పాడె మోసిన జగన్.. అంత్యక్రియలు పూర్తయ్యే వరకూ అక్కడే ఉన్నారు. ముద్రగడ అంత్యక్రియలకు పెద్ద సంఖ్యలో అభిమానులు.. మద్దతు దారులు తరలి వచ్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -