- Advertisement -

‘వారణాసి’: స్లో మోషన్ జంప్స్‌తో అదరగొట్టనున్న ప్రియాంక చోప్రా!

- Advertisement -

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న భారీ ప్రాజెక్ట్ ‘వారణాసి’. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో మహేశ్‌కు జోడీగా ప్రియాంక చోప్రా ‘మందాకిని’ అనే కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఒక పాడ్‌కాస్ట్ కార్యక్రమంలో ప్రియాంక చోప్రా ఈ సినిమా విశేషాలను పంచుకున్నారు.

ఈ సినిమా కోసం తాను గత 14 నెలలుగా పనిచేస్తున్నానని ప్రియాంక చోప్రా వెల్లడించారు. రాజమౌళి ప్రతి సన్నివేశాన్ని ఎంతో క్షుణ్ణంగా పరిశీలిస్తారని, అందుకే ఆయన సినిమాకు ఎక్కువ సమయం తీసుకుంటారని ఆమె పేర్కొన్నారు. ఈ చిత్రంలో తాను అనేక అద్భుతమైన స్లో మోషన్ జంప్స్ చేశానని చెబుతూ, ప్రస్తుతం సినిమా గురించి అంతకంటే ఎక్కువ వివరాలు వెల్లడించలేనని ఆమె స్పష్టం చేశారు. తాను కెరీర్‌లో చేసిన సినిమాలన్నింటిలోకి ‘వారణాసి’ పూర్తి భిన్నమైనదని ఆమె గతంలోనే తెలియజేశారు.

ఈ సినిమాకు సంబంధించి కీలక సన్నివేశాల చిత్రీకరణ ఇప్పటికే పూర్తయిందని రాజమౌళి తెలిపారు. మొత్తం షూటింగ్ ప్రక్రియ అక్టోబర్ నాటికి పూర్తి కానుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేపట్టి, వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నుంచి చిత్ర ప్రమోషన్లను ప్రారంభించే అవకాశం ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగితే, ఏప్రిల్ 7న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -