- Advertisement -

తండ్రి కోసం వెన‌క్కి తగ్గిన కొడుకు!

- Advertisement -

విజయ్ తనయుడు జాసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సిగ్మా’. అయితే, తన తండ్రి నటించిన ‘జన నాయగన్’ సినిమా కోసం సంజయ్ తన సినిమా విడుదలను వాయిదా వేసుకున్నట్లు సమాచారం.

విజయ్ నటించిన ‘జన నాయగన్’ సినిమా సుమారు ఏడు నెలల నిరీక్షణ తర్వాత జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజయ్ అభిమానులు ఈ చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో, తన తండ్రి సినిమాకు ఎలాంటి పోటీ లేకుండా ఉండాలని, సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘సిగ్మా’ చిత్రాన్ని జూలై 31 నుంచి ఆగస్టుకు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఆగస్టు నెలలో పెద్ద సినిమాలేవీ లేకపోవడం కూడా సంజయ్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఒక కారణంగా కనిపిస్తోంది. అయితే, ఈ మార్పుపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ‘సిగ్మా’ తన జీవితంలో అత్యంత ప్రత్యేకమైన చిత్రమని గతంలో సంజయ్ పేర్కొన్నారు.

దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్న సంజయ్, త్వరలోనే నటుడిగా కూడా వెండితెరకు పరిచయం కానున్నారనే వార్త కోలీవుడ్‌లో ఆసక్తికరంగా మారింది. ప్రముఖ నిర్మాత జీకేఎమ్ తమిళ్ కుమారన్ తన సొంత నిర్మాణ సంస్థలో సంజయ్‌ను హీరోగా పరిచయం చేయనున్నట్లు సమాచారం. తండ్రి విజయ్ సినిమాల నుంచి వైదొలగిన తరుణంలో, ఆయన తనయుడు దర్శకత్వంతో పాటు నటనలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -