- Advertisement -

మంట పుట్టిస్తున్న మరో వేసవి.. మళ్లీ అవే ఉష్ణోగ్రతలు

- Advertisement -

వేసవి పోయింది… వర్షాకాలం వచ్చిందని అందరూ భావించారు. రుతుపవనాల ఆగమనంతో ఇక వేడి నుంచి రిలీఫ్ వచ్చినట్టేనని అనుకున్నారు. అయితే, తెలుగు రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వేసవి తరహా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాల్పులు కొనసాగుతున్నాయి. ఉక్కపోత ఇబ్బంది పెడుతోంది. వర్షాలు అడ్రస్ లేవు. ఎల్ నినో ప్రభావం తో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరి కొద్ది రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతందని వాతావరణ అధికారులు చెబుతున్నారు.

వేసవి తీవ్రత మళ్లీ మొదలైంది. భానుడి భగ.. భగలకు జనం అల్లాడిపోతున్నారు. వర్షాకాలం లోనూ వేసవి తరహాలో పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జూన్‌ 1 నుంచి జూలై 13 వరకు హైదరాబాద్‌ జిల్లాలో సాధారణంగా 175 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా, 100.1 మిల్లిమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇది సాధారణం కంటే 43 శాతం తక్కువని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో సాధారణం కంటే 26 శాతం, మేడ్చల్‌-మల్కాజిగిరిలో 54 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. అటు ఏపీలోనూ ఇదే స్థాయిలో ఎండలు నమోదు అవుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 28 తక్కువ వర్షపాతం ఈ సీజన్‌లో నమోదైంది. మరో వారం రోజులు భారీ వర్ష సూచనలు కన్పించడం లేదని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం సాధారణం కంటే 3-4 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నగరంలో నమోదవుతున్నాయి. మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. సాధారణం కంటే 4-5 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోద అవుతున్నాయి. రాబోయే వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు మరో 2-3 డిగ్రీలు పెరిగే అవకాశాలుంటాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో.. పెరుగుతున్న ఎండలు.. ఉక్కపోత వేళ తిరిగి అందరూ ఏసీలు ఆన్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -