- Advertisement -

ప్రభుత్వ అధికారిక అంత్యక్రియలకు ముద్రగడ కుటుంబం నో..

- Advertisement -

ముద్రగడ పద్మనాభం అధికారిక అంత్యక్రియలకు ఆయన కుటుంబ సభ్యులు నో చెప్పారు. ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో ముద్రగడకు అంత్యక్రియలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ముద్రగడ పద్మనాభం కుపటుంబసభ్యులు తిరస్కరించారు. ముద్రగడను అనేక విధాలుగా అవమానించారని.. ఇప్పుడు అధికారిక లాంఛనాలు అవసరం లేదని స్పష్టం చేసారు.

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని ముద్రగడ పద్మనాభం కుటుంబ సభ్యులు తిరస్కరించారు. బతికున్న సమయంలో ముద్రగడను అనేక విధాలుగా అవమానించా రని.. ఇప్పడు అధికారిక గౌరవాలు, సానుభూతి అవసరం లేదని ఆయన కుటుంబసభ్యులు స్పష్టం చేశారు.వైసీపీ నేత జక్కంపూడి రాజా ఈ విషయాన్ని వెల్లడించారు. ముద్రగడ అధికారం వెంట పరిగెత్తిన వ్యక్తి కాదని.. ప్రజా సమస్యలపై పోరాడిన నాయకుడు అని తెలిపారు. ఆయన బతికున్నప్పుడు ఇబ్బందులకు గురిచేసి.. ఇప్పుడు మరణించిన తర్వాత మొసలి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదని అన్నారు.

ముద్రగడ పద్మనాభం 1953 జనవరి 22న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించారు. ముద్రగడది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఆయన తండ్రి వీర రాఘవరావు రాజకీయాల్లో క్రియాశీలంగా పనిచేశారు. పద్మనాభం 1978లో జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి జనతాపార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించిన ముద్రగడకు పలువురు ప్రముఖులు నివాళి అర్పిస్తున్నారు. మాజీ సీఎం జగన్ కిర్లంపూడిలో ముద్రగడ భౌతిక ఖాయం సందర్శించి నివాళి అర్పించనున్నారు. ఈ సాయంత్రం ఆయన నివాస ప్రాంగణంలోనే ముద్రగడ అంత్య క్రియలు జరగనున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -