ముంబై లోకల్ ట్రైన్లో ప్రయాణికులకు భయానక అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఇద్దరు హిజ్రాలు ఒక యువకుడిపై అత్యంత అమానుషంగా దాడికి తెగబడ్డారు. ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ అసభ్యకరంగా ప్రవర్తించిన ఈ ఘటనకు సంబంధించిన ఉదంతం ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపుతోంది.
ప్రయాణికులు రోజూ రాకపోకలు సాగించే రద్దీ అయిన లోకల్ ట్రైన్లో ఈ ఘటన చోటుచేసుకోవడం రైలు ప్రయాణికులలో తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ట్రైన్ ఎక్కిన హిజ్రాలు ప్రయాణికుల వద్ద బలవంతంగా డబ్బులు వసూలు చేసే క్రమంలో, ఆ యువకుడు డబ్బులు ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఆ ఇద్దరు హిజ్రాలు బరితెగించి యువకుడిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. అందరూ చూస్తుండగానే పదే పదే కొట్టడంతో ఆ యువకుడు తీవ్రభయానికి గురయ్యాడు.
అంతటితో ఆగకుండా వారు తమ ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ అత్యంత అసభ్యకరంగా ప్రవర్తించారు. తోటి ప్రయాణికులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా వారు లెక్కచేయకుండా తమ ప్రతాపం చూపించారు. ఈ తంతు అంతా ట్రైన్లోని కొందరు ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో లోకల్ రైళ్లు, రద్దీ మార్కెట్లలో ఇలాంటి వేధింపులు విపరీతంగా పెరిగిపోయాయని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్న ఇలాంటి ఘటనలపై రైల్వే పోలీసులు, ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అమాయక ప్రయాణికులను బెదిరించి, బూతులు తిరుగుతూ దాడులకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, రైళ్లలో భద్రతను కట్టుదిట్టం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
