- Advertisement -

కార్గిల్ విజయ్ దివస్..జగన్ నివాళి

- Advertisement -

కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కార్గిల్ యుద్ధంలో దేశం కోసం ప్రాణాలర్పించిన అమర వీరులకు ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తూ.. మంచు పర్వతాలపై అత్యంత కఠినమైన పరిస్థితులలో సైతం వెరవక, దేశ సరిహద్దులను రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టి పోరాడిన భారత సైనికుల త్యాగాలు, శౌర్యాన్ని కొనియాడారు.

మన మాతృభూమి రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన వీర జవాన్ల అమరత్వానికి, వారి నిరుపమానమైన ధైర్యసాహసాలకు దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. కార్గిల్ విజయ్ దివస్ భారతీయ సైనిక బలానికి, దేశభక్తికి ప్రతీక అని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -