వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్రంలో ఉన్న టీడీపీ కంచుకోటలను బద్దలు కొట్టేందుకు మాస్టర్ ప్లాన్ సిద్దం చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా టీడీపీకి పట్టున్న స్థానాలపై దృష్టిసారించారు. నంద్యాల ఉప ఎన్నికల్లో వైసీపీకి ఓటమి ఎదురవడంతో పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి గురయ్యారు. పార్టీ క్యాడర్‌లో ఉత్సాహం నింపకపోతె అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ వలలో చిక్కుకొనే ప్రమాదం ఉంది. జగన్ తన పాదయాత్రతో అన్ని బలహీనతలను అధిగమించాలనే ప్రయత్నాల్లో ఉన్నారట. పార్టీని బలోపేతం చేయడంతో పాటు టీడీపీ కంచుకోటల్లో ఎలా పాగా వేయాలన్న దానిపై ఆయన ప్రత్యేక ఫోకస్ పెడుతున్నారట.
దీనికోసం భారీ ప్తాన్‌ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అధికారపార్టీకి కంచుకోటలుగా ఉన్న 50 నియేజక వర్గాల్లో జగన్ పర్యటించాలనిభావిస్తున్నారట. తద్వారా వైసీపీ ప్రభావాన్ని ఆ నియోజకవర్గాల్లో విస్తరించాలనేది ఆయన ప్లాన్. ఇందుకోసం ఇప్పటికే ఆయా సెగ్మెంట్ల జాబితా కూడా జగన్ చేతికి వచ్చింది.
ప్రధానంగా జాబితాలో జాబితాలో 7సార్లు టీడీపీ గెలిచిన 16అసెంబ్లీ సెగ్మెంట్ల వివరాలతో పాటు, ఆరుసార్లు గెలిచిన 28అసెంబ్లీ సెగ్మెంట్ల వివరాలు ఉన్నాయట. ఇందులో హిందూపురం, కుప్పం నియోజకవర్గాలను మినహాయించి తెలుగుదేశం-వైసీపీ సమవుజ్జీలుగా ఉన్న మరో నాలుగు నియోజకవర్గాల వివరాలు కూడా తెప్పించుకున్నారట.
జగన్ ఎంచుకున్న 50సెగ్మెంట్లలో పార్టీని బలోపేతం చేయడమే ధ్యేయంగా పావులు కదపనున్నారు. పాదయాత్ర రూట్ మ్యాప్‌ను ఈ 50సెగ్మెంట్ల మీదుగా సిద్దం చేయనున్నారు. పాదయాత్ర సందర్భంగా.. ఆయా సెగ్మెంట్లలోని వైసీపీ నేతలను జగన్ నేరుగా కలుస్తారు. కాబట్టి పక్కా పకడ్బందీ ప్రణాళికతో టీడీపీ కంచుకోటల్లో పార్టీని విస్తరించాలని జగన్ భావిస్తున్నారు.
