- Advertisement -

ఆహుతి ప్రసాద్‌ అసలు ఎలా చనిపోయారో తెలుసా..?

- Advertisement -

ఆహుతి ప్రసాద్‌.. అయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనకంటు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు. ఎన్నో సినిమాలో విభిన్న పాత్రలు పోషించిన నటుడు. ఆయన సినిమాల్లో నటిస్తూనే చనిపోయాడు. ఆయన చనిపోయిన టైంలో రెండు మూడు సినిమాలకు డేట్లు కూడా ఇచ్చాడు. ఆహుతి ప్రసాద్‌ అంత హఠాత్తుగా మరణించడం వెనుక కారణం ఏంటని అంతా ఆశ్చర్యపోయారు.

ఆయన ఆత్మహత్య చేసుకున్నాడనే పుకార్లు కూడా వచ్చాయి. కాని అసలు విషయం వేరే ఉంది. అయన మరణంకు కారణం క్యాన్సర్‌ అని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ టైంలో కుటుంబ సభ్యులు ఆహుతి ప్రసాద్‌ మరణంపై క్లారిటీ ఇవ్వలేదు. కానీ తాజాగా ఆయన కుటుంబ సభ్యులు స్పందిస్తూ స్కిన్‌ క్యాన్సర్‌ కారణంగా ఆయన చనిపోయినట్లుగా తెలిపారు. చిన్న చిన్న ఇబ్బందులు కనిపించినా కూడా అవి క్యాన్సర్‌ అయ్యి ఉంటుందని ఏ ఒక్కరు భావించరు. ఆహుతి ప్రసాద్‌ కూడా అలానే పట్టించుకోలేదట. దాంతో స్కిన్‌ క్యాన్సర్‌ కాస్త ముదిరిపోయింది. హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయన మరణించి ఇంత కాలం అయినా కూడా ఆయన స్థానంను భర్తీ చేయగల నటుడిని తెలుగు సినిమా పరిశ్రమ ఇంకా కనిపెట్టలేక పోయింది. కొన్ని పాత్రలను ఆహుతి ప్రసాద్‌ మాత్రమే చేయగలడు. ఆయన లేకపోవడంతో ఇప్పుడు అలాంటి పాత్రలను దర్శకు రచయితలు రాసేందుకు, తీసేందుకు ఆసక్తి చూపడం లేదు.

చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తిని పెంచుకున్న ఆహుతి ప్రసాద్‌ చెన్నై, హైదరాబాద్‌లో అవకాశాల కోసం చాలా తిరిగారు. యాక్టింగ్‌ స్కూల్‌లో పని చేస్తూ సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు. కనకాల యాక్టింగ్‌ స్కూల్‌ ఇంచార్జ్‌గా కూడా వ్యవహరించిన ఆహుతి ప్రసాద్‌కు మొదటి ఛాన్స్‌ ఇచ్చింది నాగార్జున. అప్పటి నుండి కూడా ఆహుతి ప్రసాద్‌ వెనుదిరిగి చూసుకోలేదు. విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఇలా అన్ని రకాలుగా పాత్రలను పోషించారు. ఆహుతి ప్రసాద్ మరణం వెనుక ఉన్న అసలు నిజం కుటుంబ సభ్యులు ఎట్టజేలకు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -