పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న టీడీపీకి రెండు మూడు రోజుల్లో విజయవాడ రాజకీయాల్లో బిగ్‌షాక్ తగలనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. పార్టీపై అసంతృప్తిగా ఉన్న నేతలందరూ జగన్ పాదయాత్రలో వైసీపీ ఖండువా కప్పుకొనేందుకు సిద్ధంగా ఉన్నారు. తాజాగా టీడీపీనుంచి మరో కీలక సీనియర్‌నేత టీడీపీని వీడేందుకు సిద్దంగా ఉన్నారు.
విజయవాడ టీడీపీలో కీలక నేత అయిన ఎంవీర్ చౌదరి (మండవ వెంకట్రామ్ చౌదరి) ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ఈనెల 29న జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. వందలాది మంది కార్యకర్తలతో వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఏళ్ల తరబడి టీడీపీకి సేవలందించినా, సరైన గుర్తింపు లభించలేదనే ఆవేదనతోనే ఆయన పార్టీ మారుతున్నారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఎంవీఆర్ చౌదరికి ప్రజలల్లో మంచి. పట్టుంది. ఆయన పార్టీ మారితే టీడీపీకి ఇబ్బంది పరిస్థితులు తప్పవు. 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ రావు టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఆయన భార్య అనురాధ కృష్ణా జిల్లాపరిషత్ ఛైర్మన్ గా ఉన్నారు. భార్యాభర్తలిద్దరికీ పదవులు కట్టబెట్టి, తనను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావనతోనే, ఎంవీఆర్ చౌదరి టీడీపీకి గుడ్ బై చెబుతున్నారు. ఆయనతో పాటు మరో నేత కూడా పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారంట. అయితె వైసీపీ అధిష్టానం నుంచి హామి రాకపోవడంతో సందిగ్ధంలో ఉన్నారు సదరు నేత.
