- Advertisement -

టీడీపీ ఎమ్మెల్యే అక్రమాల‌పై ప‌వ‌న్‌కు ఫిర్యాదు

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో అధికార కూటమి (టీడీపీ-జనసేన-బీజేపీ) పరిధిలోని చంద్రగిరి నియోజకవర్గంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. స్థానిక తెలుగుదేశం పార్టీ (TDP) ఎమ్మెల్యే పులివర్తి నాని అనుసరిస్తున్న తీరుపై జనసేన పార్టీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. చంద్రగిరి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై జనసేన ఇన్‌చార్జ్ దేవర మనోహర్ నేరుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం సంచలనం సృష్టిస్తోంది.

చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నాయకులు యథేచ్ఛగా సాగిస్తున్న అక్రమ మైనింగ్ వల్ల స్థానిక పర్యావరణం పూర్తిగా నాశనమవుతోందని దేవర మనోహర్ డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని ఈ అక్రమాలను అడ్డుకోవాల్సింది పోయి, మైనింగ్ మాఫియా నుండి భారీగా కమీషన్లు తీసుకుంటూ వారిని వెనకేసుకొస్తున్నారని, అక్రమ మైనింగ్‌ను మరింత ప్రోత్సహిస్తున్నారని దేవర మనోహర్ తన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేశారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ చంద్రగిరిలో గత ప్రభుత్వ తరహాలోనే అక్రమ దోపిడీ కొనసాగుతోందని జనసేన నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న ఈ అక్రమ మైనింగ్‌ను తక్షణమే అరికట్టేలా, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేలా చొరవ చూపాలని పవన్ కళ్యాణ్‌ను దేవర మనోహర్ కోరారు.

సొంత కూటమికి చెందిన ఎమ్మెల్యేపైనే జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జ్ అక్రమాల నివేదికతో డిప్యూటీ సీఎంకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు టీడీపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -