- Advertisement -

ప్రైవేటుకు రుషికొండ భవనాలు లీజు..!!

- Advertisement -

ఏపీ ప్రభుత్వం రుషికొండ భవనాల పై నిర్ణయం తీసుకుంది. ఈ భవనాల వినియోగం పైన రాజకీయంగానూ చర్చ సాగింది. భవనాలను ఎలా వినియోగించాలో అభిప్రాయ సేకరణ.. నిర్ణయం కోసం ప్రభుత్వం నియమించిన కేబినెట్ సబ్ కమిటీ కీలక సిఫార్సులు చేసింది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వం ఈ భవనాలను ప్రయివేటు సంస్థలకు లీజుకు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఇందు కోసం ఏపీటీడీసీ ప్రకటన జారీ చేసింది.

ప్రభుత్వం రుషికొండ భవనాలను ప్రయివేటుకు లీజుకు ఇవ్వాలని డిసైడ్ అయింది. వైసీపీ హయాంలో నిర్మించిన ఈ భవనాలను ఏ విధంగా వినియోగం తీసుకురావాలనే అంశం పైన గత రెండేళ్ల కాలంగా అనేక చర్చలు జరిగాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉప సంఘం అనేక ప్రతిపాదనలు.. సాధ్యాసాధ్యాల పైన చర్చించింది. అభిప్రాయ సేకరణ చేసింది. భవనాలను సీఎం చంద్రబాబు.. ఉప ముఖ్యమంత్రి పవన్ తో పాటుగా కూటమి నేతలు నేరు గా సందర్శించారు. భవనాలు వినియోగంలో లేకపోయినా నిర్వహణా వ్యయం భారంగా మారటం తో మంత్రివర్గ ఉప సంఘం ప్రయివేటుకు లీజుకు ఇవ్వాలని చేసిన సిఫారసు మేరకు తాజాగా ప్రకటన చేసారు. కాగా, రుషికొండపై 9.8 ఎకరాల్లోని అయిదు బ్లాకుల్లో నిర్మాణాలను అప్పగించనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

ప్రాంగణంలో ఉద్యానవనాలు, అంతర్గత రహదారులు, నడక దారులు, పార్కింగ్ తో పాటు అన్ని వసతులతో భవనాలు సిద్దంగా ఉన్నాయని ప్రకటనలో వివరించారు. అదే విధంగా ఈ భవనాలతో పాటుగా 1200 చదరపు మీటర్ల ఖాళీ స్థలాలు ఉన్నాయని.. అందులో 4,800 చదరపు మీటర్లలో జీ+1 భవనాలు నిర్మాణం చేసుకోవచ్చని సూచించారు. ఆసక్తి ఉన్న సంస్థలు ఈ నెల 10వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచన చేసారు. కాగా, ఈ భవనాల నిర్వహణ కు తాజ్, అట్మాస్మియర్ కోర్, లీలీ, ఫఎమా వంటి అంతర్జాతీయ సంస్థలు ముందుకు వచ్చి.. భవనాల ను పరిశీలన చేసాయి. అయితే, అదనపు గదుల నిర్మాణానికి సీఆర్జెడ్ నిబంధనలు అడ్డంకిగా మారాయి. ఇక, ఇప్పుడు ప్రభుత్వం జారీ చేసిన ప్రకటన మేరకు ముందుకు వచ్చే సంస్థలకు రుషికొండ భవనాలను అప్పగించేందుకు రంగం సిద్దం అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -