- Advertisement -

రూమ్‌ నం.1611లో ఏం జరిగింది?

- Advertisement -

లంగర్‌హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎండీ లైన్స్ వద్ద గల ఒక లాడ్జిలో రేణుక (26) అనే యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా సంచలనం రేపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

అల్వాల్ ప్రాంతానికి చెందిన రేణుకకు గోల్కొండ వాసి ఫారుక్ (34)తో పరిచయం ఉంది. వీరిద్దరూ కలిసి నిన్న రాత్రి ఆ లాడ్జిలో గది నంబర్ 1611ను బుక్ చేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో రేణుక మృతి చెందింది. తాను కొద్దిసేపు బయటకు వెళ్ళి తిరిగి వచ్చేసరికి రేణుక గదిలో ఉరివేసుకుని కనిపించిందని ఫారుక్ పోలీసులకు సమాచారం అందించాడు.

అయితే రేణుక మృతిపై కుటుంబ సభ్యులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇది ఆత్మహత్య కాదని కచ్చితంగా హత్యేనని వారు ఆరోపిస్తున్నారు. ఫారుక్ ప్రమేయం ఉందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. సమాచారం అందుకున్న లంగర్‌హౌస్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.

ఈ కేసులో భాగంగా ఫారుక్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. రేణుక మృతి వెనుక అసలు కారణాలు ఏమిటి? ఇది హత్యా లేక ఆత్మహత్యా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. కీలక ఆధారాల కోసం గదిలోని వస్తువులను పరిశీలిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక అలాగే ఫోరెన్సిక్ ఆధారాలు అందాక మృతికి గల స్పష్టమైన కారణాలు వెల్లడవుతాయని పోలీసులు పేర్కొన్నారు. ఫారుక్ ఇచ్చిన వివరణపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -