అతడు పంచ్ వేస్తే ఎలా పేలుతుందో…. వాళ్లు వీళ్లు చెప్పాల్సిన అవసరం లేదు.తెలిగొచ్చిన ప్రతి ఒక్కరికి అది ఇప్పటి వరకూ ఎలా పేలిందో బాగా తెలుసు.పంచింగ్ పలక్ నామాకు అతను కేరాఫ్ ఎడ్రస్ .చేతలతో కాకుండా మాటలతో కొట్టడమంటే అతనికి భలే సరదా.ఇంతకాలం ప్రేక్షకులు అతడి ఖలేజా చూసారు కాబట్టే…చివరకు జులాయి అడిగితే కూడా… అత్తారింటికి దారేదో చెప్పేసి…. అతన్ని సన్నాఫ్ సత్యమూర్తిని చేసేశారు.ఇన్ని వచ్చిన వాడు మళ్లీ అ,ఆ, ఇ,ఈలు… నేర్పుతానంటే మనం నేర్చుకోకుండా ఉంటామా చెప్పండి.అందుల్లో ఏం రాసిపెట్టాడో ఎవరికి ఎరుక.ఓకే…మ్యాటర్లో కొచ్చేద్దాం. మన బర్త్ డే బాయ్ త్రివిక్రముడు గురించి అతనంత కాకపోయిన మనకు తెలిసినంతలో కొంత తెలుసుకుందాం.
1.ఆకెళ్ల శ్రీనివాస్ అనే త్రివిక్రమ్ శ్రీనివాస్ భీమవరం డీఎన్ ఆర్ కళాశాలలో చదువుతున్నప్పుడు యాంటీ రిజర్వేషన్ కోసం పోరాడాడు.
2.హైద్రాబాద్ వచ్చిన కొత్తలో ట్యూషన్లు చెబుతూ పంజాగుట్టలోని పిఎస్ కు బ్యాక్ సైడ్ లైన్లో అద్దెకుంటూ సినిమా ప్రయత్నాలు మొదలు పెట్టాడు.
3.పోసాని దగ్గర గోస్ట్ రైటర్ గా పని చేస్తూనే తనకున్న సర్కిల్లో సొంత ప్రయత్నాలు మొదలు పెట్టాడు.
4.వేణు అతని ఫ్రెండ్ ప్రభు ద్వారా వారికి రెండు సినిమాలు చేసి కెవిజయ భాస్కర్ తో నువ్వే కావాలి చిత్రం చేసి రైటర్ గా నిలబడ్డాడు.
5.ఇక మెగా కాంపౌండ్ లో చేరి మూడు సినిమాలు చేసి స్టార్ డైరెక్టర్ గాను ఎదిగాడు.
త్రివిక్రమ్ గురించి పరిశ్రమలో ఆసక్తిగా కొన్ని విషయాలు మాట్లాడుకుంటారు. నువ్వే నువ్వే డైరెక్ట్ చేసినవాడు అతడును ఎలా డైరెక్ట్ చేశాడు అని.
ఆ రెంటికి ఎంతటి వ్యత్యాసం ఉందో చెప్పనక్కర్లేదు.అతడులో మందార చెట్టుంది మూడు లక్షలు వేసావ్ ,అరటి చెట్టు ఉంటే ఐదు లక్షలో వేస్తావా అనే డైలాగ్ ,బ్రహ్మానందం ఎపిసోడ్లో పిల్లవాడు బ్రహ్మీ కడుపు మీద గుద్ది మన స్కూల్ బెంచ్ లా ఎంత గట్టిగా ఉందరా అని చెప్పే డైలాగ్ ఎత్తగొప్పగా పేలాయో చెప్పనవసరం లేదు. డైలాగ్ రైటర్ గానే కాకుండా అదే సినిమా ట్రాక్టర్ ఇంజిన్ ఆపితే వచ్చే సైలెన్స్ కు సైలెన్స్ ఎంత వయలెంట్ గా ఉంటుందో చెప్పే మాటకు మధ్య ఆలోచించిన విధానం త్రివిక్రమ్ ను ఎక్కడికో తీసుకుపోయాయి.
ఇక ఆతరువాత వచ్చిన చిత్రాలు గురించి మనందరికీ తెలిసిందే. అతడు గురించే ఎందుకు ఎక్కువగా చెపుకోవల్సి వచ్చిందంటే టీవీల్లో ఎప్పుడు అతడు వేసినా…రేటింగులు ఓ రేంజ్ లో పేలుతూ ఉంటాయి కాబట్టి.
