పది సంవత్సరాల సిద్దేశ్ కథ ఇది, రోజూ తండ్రితో పాటు టీ స్టాల్ నడుపుకుంటూ బతికే సిద్దేశ్ ఉదయం సమయం స్కూలు కి వెళ్లి మధ్యాన్నం నుంచీ తండ్రికి సహాయం చేస్తూ ఉంటాడు. ఆ రోజు ఆదివారం కావడం తో తండ్రితోనే ఉండి టీ స్టాల్ పనులలో నిమగ్నం అయి ఉన్నాడు. రైల్వే ట్రాక్ దాటుకుంటూ తండ్రి చెప్పిన కాఫీ పొడి డబ్బా కోసం వెళుతున్న సిద్దేశ్ కి రైలు పట్టా ఒకటి తెగి పడిపోయిన విషయం కనిపించింది .
అంత చిన్న ఏజ్ లో కూడా ఆ పట్టా వలన రైలు కి పెద్ద ప్రమాదం జరుగుతుంది అని గ్రహించడమే సిద్దేశ్ యొక్క గొప్పతనం గా చెప్పుకోవాలి. ఈ విషయం వెంటనే తన తండ్రితో చెప్పాడు ఆ కుర్రాడు. ఇలోగా ఊరంతా వచ్చి ఆ రైల్వే ట్రాక్ దగ్గర గుమిగూడి విషయం చూస్తూ ఉండగానే రైలు అదే తోవలో వస్తూ ఉంది. దీంతో వెంటనే ప్రమాదాన్ని ఆపడానికి ఎర్ర క్లాత్ ఇమ్మని ఊరి పెద్ద అరవడం తో సిద్దేశ్ ట్రైన్ కి ఎదురు గా పరుగు తీసాడు. సిద్దేశ్ ఎరుపురంగు టీ షర్టు వేసుకుని ఉన్నాడు వెంటనే దాన్ని విప్పు ట్రైన్ వైపు చూపిస్తూ ఊరివారితో పరిగెత్తాడు. ఇది దూరం నుంచి గమనించిన లోకో పైలెట్ వెంటనే ట్రైన్ బ్రేకు వేసి ఆపేసాడు. దాదాపు ఎనిమిది వందలకి పైగా ప్రయాణీకులు ఈ సంఘటనలో కాపాడడ్డారు. ఈ జరిగిన విషయం తెలుసుకున్న వారంతా ట్రైన్ దిగి మరీ ఆ కుర్రాడిని ఎత్తుకుని ముద్దులతో ముంచెత్తారు.
ఆ వయసులో దేవుడే స్వయంగా వారందరినీ కాపాడడం కోసం ఆ బుడతడి రూపం లో వచ్చాడు అని వారు చెప్పుకొచ్చారు. 10 సంవత్సరాలు కూడా నిండని ఈ కుర్రాడి సాహసం అంతమందిని కాపాడింది. ” ప్రమాదాన్ని ఎలాగైనా ఆపాలని నేను వెంటనే ట్రైన్ కి ఎదురు పరిగెత్తాను ఇంకేమీ ఆలోచించలేదు, అందుకే భయం కూడా వెయ్యలేదు ” అంటూ మీడియా తో మాట్లాడుతూ చెప్పాడు సిద్దేశ్.
