- Advertisement -

బెల్లంకొండ హీరోతో త‌మిళ హీరో ఫైట్‌

- Advertisement -

బెల్ల‌కొండ శ్రీనివాస్ ఇప్పుడు త‌న త‌ర్వాతి సినిమాను ప్రారంభించాడు. మొన్న‌నే ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో అధికారికంగా ప్ర‌క‌టించాడు. వంశధార క్రియేషన్స్ బ్యాన‌ర్‌లో నవీన్ శొంటినేని ఈ సినిమా నిర్మిస్తున్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాతో దర్శకుడిగా శ్రీనివాస్ రెడ్డి పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో కాజల్ కూడా న‌టిస్తుండ‌గా మరో హీరోయిన్‌కు కూడా అవ‌కాశం ఉంది.

ఈ హీరోయిన్ల ప‌క్క‌న ఓ త‌మిళ హీరో న‌టించ‌నున్నాడు. ఒక ముఖ్య పాత్రలో తమిళ హీరో శ్రీకాంత్ నటించ‌డానికి ఎంపిక చేశారు. గ‌తంలో తెలుగు సినిమాల్లో న‌టంచిన శ్రీకాంత్ ఆ త‌ర్వాత మ‌ళ్లీ క‌నిపించ‌లేదు. ఇప్పుడు చాలా రోజుల త‌ర్వాత తెలుగు సినిమాలో ఫుల్ లెంగ్త్‌ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. థ్రిల్లర్ నేప‌థ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.

ప్ర‌స్తుతం శ్రీ వాసు ద‌ర్శ‌క‌త్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ‘సాక్ష్యం’ సినిమా మే 18వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమా విజ‌యంపై శ్రీనివాస్ ధీమాగా చేస్తున్నాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -