- Advertisement -

వైసీపీ పెట్టే అవిశ్వాసానికి మద్ద‌తు ప్ర‌క‌టించిన చంద్ర‌బాబు..

- Advertisement -

దేశ వ్యాప్తంగా ఇప్పుడు ఎక్క‌డ చూసినా కేంద్రంపై అవిశ్వాసం గురించే చ‌ర్చించుకుంటున్నారు. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా శుక్రవారం వైసిపి ప్రవేశపెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి అనూహ్యంగా చంద్ర‌బాబు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ప్ర‌స్తుత రాజ‌కీయాల నేప‌థ్యంలో అందుబాటులో ఉన్న మంత్రుల‌తో బాబు సుదీర్ఘంగా చ‌ర్చించారు. రాష్ట్రప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఎవరు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినా టిడిపి మద్దతు ఇవ్వాల్సిందే అంటూ చంద్రబాబు స్పష్టం చేశారట.

మామూలుగా అయితే ఈనెల 21న అవిశ్వాసం తీర్మానం పెట్టాల‌ని నిర్న‌యించారు. అయితే అనూహ్యంగా శుక్ర‌వార‌మే అవిశ్వాసం ప్ర‌వేశ పెట్టాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది. ఇప్ప‌టికే అవిశ్వాసానాకి లోక్‌సభ సభ్యుల మద్దతు కూడగట్టే పనిలో బిజీగా ఉన్నారు.

శుక్రవారం ఉదయం పొలిట్ బ్యూరో సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. ఎన్డీఏలో కొనసాగే విషయంపై పొలిట్ బ్యూరోలో చర్చించనున్నట్లు చంద్రబాబు చెప్పారు. టిడిపి విషయంలో కేంద్రం లేదా బిజెపి అనుసరిస్తున్న వైఖరిని దృష్టిలో పెట్టుకునే రేపటి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలన్న సంచలన నిర్ణయాన్ని చంద్రబాబు తీసుకున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -