ఇండియా టేబుల్ టెన్నిస్ ప్లేయర్ సౌమ్యజిత్ ఘోష్‌కు కష్టాలు మొదలయ్యాయి. ఆయన తనపై అత్యాచారం చేశాడంటూ 18 ఏళ్ల యువతి బెంగాల్ పోలీసులకు ఫిర్యాదు చేయడం, ఆపై కేసు నమోదు చేయడం జరిగిపోయింది. దీనిపై దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు. బెంగాల్‌కి చెందిన సౌమ్యజిత్ ఘోష్.. భారత్ తరపున రెండు ఒలింపిక్స్ (2012, 2016)లో పాల్గొన్నాడు. అంతేకాదు అర్జున అవార్డు గ్రహీత కూడా.
సౌమ్యజిత్ తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మూడేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడని.. అతని కారణంగా తాను ఒకసారి అబార్షన్ కూడా చేయించుకున్నట్లు యువతి ఆరోపిస్తోంది. సౌమ్యజిత్‌తో 2014లో సోషల్ మీడియా ద్వారా పరిచయం ఏర్పడిందని.. అప్పటి నుంచి తాము రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వివరించిన యువతి వెల్లడించింది.
కోల్‌కతాలోని సౌమ్యజిత్ ప్లాట్‌లో తాము కలుసుకునేవాళ్లమని.. అతని కారణంగా ఓసారి అబార్షన్ కూడా చేయించుకున్నట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తాజాగా తనని పెళ్లి చేసుకునేందుకు సౌమ్యజిత్ నిరాకరిస్తున్నాడని బరాసత్ మహిళా పోలీసులకి బాధితురాలు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
