- Advertisement -

సినిమాటిక్‌గా.. స్టుపిడ్‌గా ఉండే పొలిటికల్ థీయరీస్‌: కోన

- Advertisement -

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సినీనటులు స్పందించ‌డం లేదు అని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. హీరో శివాజీ ఏకంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, బాల‌కృష్ణ త‌దిత‌రుల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశాడు. ఈ స‌మ‌యంలో ప‌వ‌న్‌కు వీరాభిమానిగా ఉన్న సినీ ర‌చ‌యిత, ద‌ర్శ‌కుడు కోన వెంక‌ట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప‌వ‌న్ నిజాయ‌తీ గ‌ల నాయ‌కుడు అని ప‌రోక్షంగా చెప్పాడు. ఈ విష‌య‌మై ట్వీట‌ర్‌లో పోస్ట్ చేశారు. కొంతమంది సినీనటులు నిజమైన రాజకీయ నాయకులను విమర్శిస్తున్నారని.. అది మంచి పద్ధతి కాదని వెంకట్ ట్వీట్ చేశారు.

ప్రత్యేక హోదా నేపథ్యంలో సినీ రంగానికి చెందిన కొందరు వ్యక్తులు కొద్ది రోజులుగా రకరకాల విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోన వెంకట్ వారే ల‌క్ష్యంగా ట్వీట్ చేశారు.

ఏం ట్వీట్ చేశాడంటే… `ఇండస్ట్రీకి చెందిన కొంతమంది నటులు సినిమాటిక్‌గా.. స్టుపిడ్‌గా ఉండే పొలిటికల్ థీయరీస్‌ను ప్రచారం చేస్తున్నారు. వారు చేస్తున్న విమర్శలు.. వారి ఆలోచనా విధానం ప్రాక్టికల్‌గా ఉంటే అభినందించేవాడిని. నిజమైన నిజాయితీ గల రాజకీయ నాయకులను విమర్శించడం మానేసి.. ప్రజలు – వారి సమస్యలపై దృష్టి సారించండి బ్రదర్స్` అని ట్వీట్ చేశారు.

అయితే పవన్ పై హీరో శివాజీ చేస్తోన్న కామెంట్లను ఉద్దేశించి కోన ట్వీట్ చేశారని చెప్ప‌క‌నే తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -