జ‌గ‌న్‌ను ఫాలో అవుత‌న్నా 40 ఇయర్స్ అనుభ‌వం ఉన్న చంద్ర‌బాబు

ప్ర‌పంచ‌లో రంగులు మార్చ‌డంలో ఊస‌ర‌వెళ్లిని చూశాం. కాని ఏపీ సీఎం చంద్ర‌బాబు రంగులు మార్చ‌డం చూస్తే ఊస‌ర‌వెల్లికూడా వంద‌సార్లు ఆత్మ‌హ‌త్య చేసుకుంటుంది. మాట‌లు మార్చ‌డంలో బాబును మించినోల్లు ఎవ‌రూ లేరు. ఆయ‌న ఏవైతే వ్య‌తిరేకిస్తారో వాటినే పాటిస్తారు. ఎక్క‌డ చూసినా నిప్పు, ప‌ప్పు, మాట‌కు క‌ట్టుబ‌డే వాడిన‌ని బాబు చెప్పిన మాట‌ల‌కు ఏరోజు క‌ట్టుబ‌డ‌లేదు. ప్ర‌తిప‌క్ష నాయ‌కున్ని అనుస‌రించడం చూస్తే బాబు దైర్భాత్య రాజ‌కీయానికి ప‌రాకాష్టం.

తాజాగా చంద్ర‌బాబు ఒక రోజు దీక్ష చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. రెండు రోజుల క్రితం మోడీ దీక్షను చంద్రబాబునాయుడు తప్పు పట్టింది. పార్లమెంటు ఉభయసభల్లో ప్రతిపక్ష పార్టీల తీరును నిరసిస్తూ తను దీక్ష చేస్తున్నట్టు మోడీ ప్రకటించాడు.ప్రధాని పీఠంలో కూర్చుని నాటకాలా? అంటూ వాళ్లు ప్రశ్నించారు.

అలా ప్రశ్నించిన వాళ్లలో మోడీగారి మాజీ స్నేహితుడు చంద్రబాబు కూడా ఉన్నారు. ‘ఇలాంటి దీక్షలు చేసిన ప్రధాని ఎవరూ లేరు, మోడీ దీక్ష చేయడం విడ్డూరం..’ అంటూ బాబు విమర్శించాడు. మోడీ దీక్షలు అర్థం లేనివి అని బాబు తీర్పునిచ్చాడు. కట్ చేస్తే సీన్ మారింది.

తనూ దీక్ష చేస్తున్నట్టుగా ప్రకటించాడు చంద్రబాబు. అచ్చం మోడీ లాగే ఈ దీక్ష కూడానట. ఒక రోజు దీక్ష. పగలంతా ఉపవాసం. అచ్చం మోడీ వలే చంద్రబాబు ఈ దీక్ష చేస్తాడట. దీనికి ముహూర్తంగా ఏప్రిల్ ఇరవైని, తన పుట్టిన రోజును ప్రకటించాడు చంద్రబాబు నాయుడు. ప్రత్యేకహోదా, కేంద్రంపై అవిశ్వాసం విష‌యంలో బాబు ఎన్ని సార్లు మాట‌లు మార్చారో చూశాం.

హోదాతో ఏమీ రాదన్నాడు, హోదా అంటే జైలుకే అన్నాడు. ఇక హోదా కోసం పోరాడుతున్న జగన్ ది అనుభవ రాహిత్యం అన్నాడు. హోదాతో ఏమొస్తుందో తనకు చెప్పాలన్నాడు. తీరా చూస్తే జ‌గ‌న్‌కు వ‌స్తున్న మైలేజీని చూసి త‌ట్టుకోలేని బాబు ఎన్డీయేలోంచి బయటకు వ‌చ్చారు.

మోడీ దీక్ష చేస్తే.. పీఠంపై కూర్చుని దీక్ష చేస్తే అది విడ్డూరం అన్న చంద్రబాబు. ఇప్పుడు తనూ పీఠం మీదే కూర్చుని దీక్ష చేస్తున్నాడు. బాబు మారుస్తున్న రంగుల‌ను చూసి ఊస‌ర‌వెల్లి ఎన్ని సార్లు ఆత్మ‌హ‌త్య చేసుకోవాలో….