విశాఖపట్నం జిల్లా మాజీ ఎమ్మెల్యే కన్నబాబు వైసీపీలో చేరడం దాదాపు ఖరారైంది. వచ్చే నెల 5వ తేదీని వైసీపీ అధినేత జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నానని ఆయన స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే వెంటనే టీడీపీ మంత్రి గంటా శ్రీనివాస్‌రావును రంగంలోకి దింపింది. కన్న బాబు ఇంటికి వెల్లిన మంత్రి గంటాకు నిరాశె ఎదురయ్యింది. ఆయనకు గంటా నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే, టీడీపీలో కొనసాగలేనని గంటాకు కన్నబాబు స్పష్టం చేశారు
భేటీ తర్వాత కన్నబాబు మాట్లాడారు. గంటా శ్రీనివాసరావును రాజకీయ కారణాలతో తాను కలవలేదని… ఆయన తనకు మంచి మిత్రుడని చెప్పారు. ఎలాంటి కండిషన్లు లేకుండానే 2014లో తాను టీడీపీలో చేరానని… అయితే, తనకు పార్టీలో సరైన గౌరవం దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తన వయసు 65 సంవత్సరాలని… రాజకీయంగా ఇప్పుడు స్థిరపడకపోతే తన కుటుంబానికి గౌరవం కూడా ఉండదని చెప్పారు.
వైసీపీలో చేరాలని తాను గట్టి నిర్ణయం తీసుకున్నానని… ఆ నిర్ణయాన్ని మార్చుకోలేనని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని గంటాకు కూడా చెప్పానన్నారు. అందుకే పార్టీ మారాలనుకుంటున్నానని ఆయన మరోసారి స్పష్టం చేసినట్టు సమాచారం.
