సావిత్రి జీవిత కథను సినిమాగా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.సావిత్రి పాత్రలో హీరోయిన్ కీర్తి సురేష్ చేస్తుంది.మొదట ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తి ఎంపికపై చాల విమర్శలు వచ్చాయి.కాని ఫస్ట్ లుక్ చూసిన వారందరూ ఈ సినిమాకు కీర్తి న్యాయం చేయగలుగుతుందని భావించారు లుక్స్ పరంగా సావిత్రిలా కీర్తి సురేశ్ మంచి మార్కులు కొట్టేసిందనే విషయాన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. మరి నటన పరంగా ఎంతమేరకు మెప్పిస్తుందో చూడాలి.
ఈ సినిమా కోసం కీర్తి సురేష్ బాగానే కష్టపడిందనే చెప్పాలి.ఆ కష్టనికి ప్రతిఫలంగా బాగానే డబ్బులు డిమాండ్ చేసిందని వినికిడి. ఈ సినిమాకు కోటి యాబై లక్షలు ముట్టజెప్పారట. తెలుగు .. తమిళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటం వల్లనే ఆమె అంత మొత్తం తీసుకుందని చెప్పుకుంటున్నారు. మహనటి సినిమా ఈ నెల 9వ తేదీన విడుదలకు సిద్దంగా ఉంది.
