- Advertisement -

ఈ సారి ఐపీఎల్ చెన్నైదేనా….?

- Advertisement -

లీగ్ ద‌శ ముగిసింది. ఇక ప్లేఆఫ్ స‌మ‌రం  స‌మ‌రం ఆరంభం కానుంది. ప్లేఆఫ్‌కు చెన్నై, హైద‌రాబాద్‌, కేకే, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ చేరాయి. మొద‌టి క్వాలిఫై మ్యాచ్ చెన్నైసూప‌ర్ కింగ్స్‌, హైద‌రాబాద్ మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. ఆదివారం ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

ఐపీఎల్ 2018 క‌ప్‌ను గెలిచే అవ‌కాశాలు ధోనీ సేన‌కే ఉన్నాయి. గత పదేళ్లలో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచి ప్లే ఆఫ్ చేరిన జట్టే ఐదుసార్లు కప్ సొంతం చేసుకుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలచిన జట్టు రెండు పర్యాయాలు మాత్రమే కప్ గెలిచింది.

2008లో రాజస్థాన్, గత ఏడాది ముంబై నెంబర్-1 నిలిచి కప్ కొట్టాయి. అలాగే అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఏడుసార్లు ఫైనల్ చేరింది.

గతంలో రెండో స్థానంలో నిలిచిన చెన్నై (2011), కోల్‌కతా (2011, 2014), ముంబై ఇండియన్స్ (2013, 2015) ఐపీఎల్ కప్ గెలవగా.. ఏడుసార్లు ఫైనల్ చేరాయి.

మూడో స్థానంలో నిలిచిన జట్లు రెండుసార్లు కప్ గెలిచాయి. నాలుగుసార్లు ఫైనల్ చేరాయి. 2010లో చెన్నై, 2016లో హైదరాబాద్ ఇలాగే కప్ సొంతం చేసుకున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -