- Advertisement -

టీమిండియాలోకి ఎంట్రీపై భువి!

- Advertisement -

భువనేశ్వర్ కుమార్ చివరిసారిగా భారతదేశం తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడి దాదాపు నాలుగేళ్లు కావస్తోంది. అయితే ఈ సీనియర్ పేసర్ జాతీయ జట్టులో స్థానం కోసం వేచిచూస్తున్నాడు. ఇటీవలి ఐపీఎల్ సీజన్‌లో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు తమ టైటిల్‌ను నిలబెట్టుకోవడంలో అద్భుతమైన పాత్ర పోషించాడు భువి. ఈ సీజన్‌లో మొత్తం 28 వికెట్లు పడగొట్టాడు.పర్పుల్ క్యాప్ విజేత కాగిసో రబడా కంటే ఇది కేవలం ఒక్క వికెట్ మాత్రమే తక్కువ.

ఈ అద్భుత ప్రదర్శనతో భువి తిరిగి భారత జట్టులోకి వచ్చే అవకాశం ఉందనే చర్చలు సహజంగానే ఊపందుకున్నాయి. అయితే ఈ పేసర్ ఆ అవకాశాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఆ నిర్ణయాన్ని పూర్తిగా సెలెక్టర్ల చేతుల్లోనే పెట్టేశాడు. నాకు మళ్లీ ఆడాలని ఉందని నేను బయటకు ప్రదర్శించకపోవడం నా నైజం అని భువనేశ్వర్ కుమార్ అన్నాడు. ఇక్కడ ప్రతి ఒక్కరూ తమ పనిని తాము చేస్తున్నారు. సెలెక్టర్లు వారి పని చేస్తున్నారు, నేను నా పని చేస్తున్నాను. జట్టును ఎంపిక చేయడం వారి బాధ్యత. నేను జట్టుకు సరిపోతానని వారు భావిస్తే, వారు తమ బాధ్యతను నిర్వర్తిస్తారు అన్నాడు.

జట్టులోకి వచ్చే అవకాశాలపై ఆయన పెద్దగా ఆశలు చూపించనప్పటికీ.. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడం వెనుక ఉండే ప్రతిష్టను భువనేశ్వర్ అంగీకరించాడు. దేశం తరఫున ఆడే అవకాశం దక్కడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపాడు. నేను దేశం కోసం ఆడాను…నేను చేయాల్సిందంతా చేశాను. ఒకవేళ నేను ఆడకపోయి ఉంటే ఒక్క మ్యాచ్ లోనైనా ఆడే అవకాశం కోసం ఎంతగానో తపించిపోయేవాడిని. భారతదేశం తరఫున ఆడటం అనేది చాలా పెద్ద విషయం, నేనేమీ దాన్ని చిన్న విషయంగా చెప్పను. దేశం తరఫున ఆడిన కొద్దిమంది అదృష్టవంతులలో నేను కూడా ఒకడిని అని ఆయన పేర్కొన్నాడు.

భువనేశ్వర్ కుమార్ ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలోనూ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాడు. తన అంతర్జాతీయ కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 294 వికెట్లు పడగొట్టాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -