పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న సినిమా సర్దార్ గబ్బర్ సింగ్. ఈ చిత్రం కోసం అభిమానులతో పాటు సినీ పరిశ్రమ ఎంతగానో ఎదురు చూస్తుంది. పవన్ సరసన కాజల్ హీరోయిన్‍గా నటిస్తున్న ఈ సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
ప్రస్తుతం ఈ సినిమా కేరళలో షూటింగ్ జరుపుకుంటుంది. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 8న ఈ సినిమా రిలీజ్‍కు సన్నాహాలు చేస్తున్నారు. ఐతే సినిమా రిలీజ్ కాకముందే పవన్ సంచలనం సృష్టిస్తున్నాడు. ఈ సినిమాని 20 కోట్లకు ఇంద్ర ఫిలిమ్స్ నైజాం హక్కులు తీసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
బాహుబలి మినహ మరే చిత్రం 13 నుండి 15 కోట్లకు మించి అమ్ముడు పోలేదు కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ సినిమా 20 కోట్లకు అమ్ముడుపోవడం ఇప్పుడు సినీ పరిశ్రమలో హట్ టాపిక్ అయింది. ఈ విషయం తెలుసుకున్న పవన్ అభిమానులు తెగ సంతోషపడుతున్నారు. సమ్మర్‍లో సినిమా రిలీజ్ అయ్యి రికార్డులు సృష్టిస్తుందని చెబుతున్నారు పవన్ అభిమానులు.
