టిడిపి ప్రభుత్వంతో లాభపడినవాళ్ళు కూడా 2019 ఎన్నికల్లో టిడిపికి ఓట్లు వేయని పరిస్థితి ఉందా? 2019 ఎన్నికల్లో టిడిపికి ఓట్లేస్తారా అని అడిగితే ……ఓట్లు వేయం అని చెప్పి చంద్రబాబు మొహం మీదే ఆంధ్రప్రదేశ్ ఓటర్లు చెప్పారా? ఈ విషయాలను ఇంకెవరో చెప్తే నమ్మాల్సిన అవసరం లేదు. అసలు అలాగే వేరే ఎవరైనా నాయకుడు చెప్పి ఉంటే బిజెపి, వైకాపా, జనసేన……..ఇంకా మోత్కుపల్లి, ముద్రగడలాంటి బాబు వ్యతిరేకులందరినీ ఒక గాటన కట్టేస్తూ పచ్చ మీడియా ప్రచారం చేస్తున్న ఆపరేషన్ గరుడ అనే నాటకంలో ఆ నాయకులను కూడా భాగస్వాములను చేస్తూ ఈ పాటికే సోమిరెడ్డిలాంటి టిడిపి నాయకులందరూ తన్నండి…..రెండు తగిలించండి అంటూ రెచ్చిపోయి ఉండేవాళ్ళే.
అయితే 2019 ఎన్నికల్లో టిడిపికి ఓట్లేస్తారా అని అడిగితే ఆలోచిస్తాం అని స్వయంగా చంద్రబాబుతోనే ఆంధ్రప్రదేశ్ ఓటర్లు చెప్తున్నారట. ఈ విషయాన్ని స్వయంగా చంద్రబాబే మీడియాతో చెప్పుకొచ్చాడు. ఎన్నికల ఏడాది కావడంతో ప్రజాభిప్రాయ సేకరణ కోసం చాలా సర్వేలే చేయిస్తున్నాడు చంద్రబాబు. అందులో భాగంగా తను కూడా స్వయంగా ప్రజలతో మాట్లాడుతున్నాడు. అందులో భాగంగానే కొంతమంది ప్రజలకు కాల్ చేసి…….టిడిపి పథకాలను ఏకరువు పెట్టి…….ఈ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేశాం…..2019 ఎన్నికల్లో టిడిపికి ఓటేస్తారా అని చంద్రబాబు అడుగుతుంటే ఆయా ప్రజలు మాత్రం ఆలోచిస్తాం అని తాపీగా సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు ఈ విషయమే చంద్రబాబులో టెన్షన్ పెంచుతోంది. అందుకే 2019 ఎన్నికల్లో టిడిపి గెలుపుపై స్వయంగా చంద్రబాబే మీడియా సాక్షిగా అనుమానాలు వ్యక్తం చేస్తుండడం గమనార్హం. అసలే వైకాపాలో భారీ చేరికలు……అన్నింటికీ మించి గుంటూరు-కృష్ణా జిల్లాలే అనుకుంటే అంతకుమించి అనే స్థాయిలో ఇప్పుడు గోదావరి జిల్లాల్లో జగన్‌కి ప్రజాదరణ దక్కుతుండడం టిడిపి శ్రేణులను డీలాపడేలా చేస్తుంటే ఇఫ్పుడు చంద్రబాబు వ్యాఖ్యలు 2019 ఎన్నికల్లో టిడిపి గెలుపుపై పూర్తిగా నమ్మకాలు పోయేలా చేస్తున్నాయని టిడిపి నేతలే ఆందోళన వ్యక్తం చేస్తుండడం ఆ పార్టీ పరిస్థితిని తెలియచేస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
