2014 ఎన్నికల్లో టిడిపి గెలవడానికి చాలానే కారణాలున్నాయి. అయితే ప్రజాదరణ మాత్రం జగన్‌కే ఎక్కువ ఉన్నది అన్న విషయం నిజం. ఈ విషయాన్ని ఇప్పటికీ కూడా జాతీయ స్థాయి మీడియా సంస్థలతో పాటు బాబు భజన మీడియా సంస్థలు కూడా ఒఫ్పుకుంటాయి. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో రాధాకృష్ణ కూడా 2014 ఎన్నికల సమయంలో జగన్‌కే ప్రజాదరణ ఉన్న విషయాన్ని ప్రస్తావించాడు. అయితే దశాబ్ధాల అనుభవం ఉన్న టిడిపి కేడర్ ముందు వైకాపా కేడర్ తేలిపోయారు. మరీ ముఖ్యంగా ఓటింగ్ సమయంలో బూత్ ఏజెంట్లు, ఆ తర్వాత కౌంటింగ్ ఏజెంట్లు సమర్థవంతంగా వ్యవహరించలేకపోయారు.
ఈ లోపాన్ని తాజాగా జగన్ కూడా గుర్తించాడని తెలుస్తోంది. రీసెంట్గా సన్నిహితులతో సమావేశమైన జగన్ ఈ విషయంపై నాయకులకు సూచనలు చేశాడట. 2019 ఎన్నికల్లో 175 నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లను సమర్థులను నిలపాలని……. ఆ విషయంలో సక్సెస్ అయితే కచ్చితంగా ప్రజాదరణ మొత్తం ఓట్లుగా మారుతుందని వైకాపా సీనియర్ నేతలు కూడా అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది.
ఇప్పుడు ఈ విషయంపైనే వ్యూహ రచన చేస్తున్నారు వైకాపా నేతలు. ఎన్నికలు వచ్చేవరకూ ఈ ఏడాది సమయం మొత్తం అత్యంత సమర్థులైన పోలింగ్ ఏజెంట్లు, కౌంటింగ్ ఏజెంట్లను తయారు చేయడం కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించడానికి ప్లాన్ చేస్తోంది వైకాపా ప్లానింగ్ కమిటీ. 2019 ఎన్నికల్లో పోల్ మేనేజ్మెంట్ విషయంలో చంద్రబాబు అండ్ కో కుట్రలు, వ్యూహాలను ఎదుర్కోవడంలో వైకాపా కేడర్ సక్సెస్ అయితే మాత్రం వైకాపా గెలుపుకు తిరుగే ఉండదని సర్వేలతో పాటు, సీనియర్ జర్నలిస్టులు కూడా అభిప్రాయపడుతున్నారు. ప్రజాసంకల్పయాత్రతో ప్రజాభిమానాన్ని భారీగా పెంచుకున్న జగన్…….ఆ అభిమానాన్ని ఓట్లుగా మలుచుకోవడంలో ఏ మేరకు సక్సెస్ అవుతాడో చూడాలి మరి.
